Advertisementt

బీసీలను పట్టించుకోని బాబు

Sun 25th Feb 2024 04:57 PM
chandrababu  బీసీలను పట్టించుకోని బాబు
BC బీసీలను పట్టించుకోని బాబు
Advertisement
Ads by CJ

టీడీపీ పార్టీని స్థాపించిన ఎన్టీయార్ ఉన్నపుడు బీసీలకు పెద్దపీట వేసేవారు. ఆయన ఉండగా ఎంతోమంది బీసీలు , దిగువ, నిమ్న కులాల నాయకులు, చివరికి పేద వాళ్ళు సైతం చట్ట సభలకు ఎన్నికయ్యేవారు.

ఎన్టీఆర్ హయాంలో టీడీపీ అంటే వెనుకబడిన వర్గాల పార్టీగా ముద్రపడడమే కాకుండా ఆ వర్గాల నుంచి అదే స్థాయిలో మద్దతు కూడా దక్కేది

కానీ టీడీపీలో చంద్రబాబు వచ్చాక బీసీలను పట్టించుకున్న పాపాన పోలేదు. బీసీలను వెనుక బెంచికి నెట్టేసి కేవలం డబ్బున్నవాల్లు, పెట్టుబడిదారులు.. కార్పొరేట్ నాయకులు..అగ్ర వర్ణాల వారికి మాత్రమే పెద్ద పీటవేసున్నారు. అసలు డబ్బులేని వాళ్ళు.. కింది స్థాయి వాళ్ళు మెల్లగా పార్టీ నుంచి కనుమరుగైపోతున్నారు

చంద్రబాబు బీసీలకు వారికి అవకాశాలు ఇవ్వరాదని, వారిని కేవలం ఓటు బ్యాంకుగా వాడుకోవాలన్నది ఆయన అభిమతం అంటూ రాజకీయాల్లో ఆయనపై విమర్శలు చేసేవారు లేకపోలేదు. తాజాగా విడుదల చేసిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలోనూ చంద్రబాబు ఈ వివక్ష చూపించారంటూ ఆరోపిస్తున్నారు.

- 45 % జనాభా ఉన్న బీసీలకు 18 సీట్లే ఇచ్చారు

- మైనారిటీలకు ఒకే ఒక్క సీటు ఇచ్చి ఊరుకున్నారు 

- 4% జనాభా ఉన్న కమ్మలకు  మాత్రం 21 సీట్లు ఇచ్చారు. 

దీంతో చంద్రబాబుపై రగిలిపోతున్న బీసీలు.. టైం కోసం వెయిట్ చేస్తున్నారు. అవకాశం వచ్చినప్పుడు తమ ఓటు పవర్ ఏమిటో చూపిస్తామని బీసీలు పిడికిలి బిగించి రెడీగా కూర్చున్నారు.

BC:

Chandrababu

Tags:   CHANDRABABU
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ