Advertisement

తప్పుడు వార్తలు రాసారు: క్రిమినల్ కేసులు పెట్టారు

Sat 29th Jul 2023 12:41 PM
yellow media  తప్పుడు వార్తలు రాసారు: క్రిమినల్ కేసులు పెట్టారు
Yellow media Destroying Press Integrity Misleading People తప్పుడు వార్తలు రాసారు: క్రిమినల్ కేసులు పెట్టారు
Advertisement

మనకు నచ్చని పార్టీ అధికారంలో ఉంటే అదేంటో లోకంలో అన్నీ ఘోరాలు.. ఎక్కడ చూసినా అన్యాయాలు కనిపిస్తాయి. అదే మనకు రోకున్న పార్టీ కానీ ప్రభుత్వంలో ఉంటే రాష్ట్రం మొత్తం రామరాజ్యంలా ఉంటుంది. నెలకు మూడు వర్షాలు.. ఏటా మూడు పంటలు ఇంటింటా నవ్వుల పరవళ్లు.. అసలు ఈ రాష్ట్రంలో కష్టం ఎక్కడా లేదా అని దేశం మొత్తం  ఆశ్చర్యపోయేలా కథనాలు వండుతారు. 

ప్రస్తుతం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉండడంతో కొంతమందికి కడుపు రగిలిపోతుంది. లోకంలో ఎక్కడ ఏది జరిగినా దాన్ని జగన్ మోహన్ రెడ్డికి ముడిపెట్టి ఇష్టానుసారం తమకి నచ్చింది జోడించి కథనాలు వండుతారు. అదే జోరులో ఒక్కోసారి వార్తలు తయారు చేసి జనంలోకి వదులుతారు.. ఆ క్రమంలో ఈ గురువారం కొన్ని మీడియా సంస్థలు కావాలని ఒక సంఘటనను అక్కడికక్కడే ప్లాన్ చేసి అది నిజం అనేలా వార్తగా రూపొందించి జనంలోకి వదిలారు. పైన గొడుగు - కింద మడుగు అంటూ ఆమె ఛానల్,  నమ్మండి - ఇది నిజంగా బడే అంటూ మరో ఓ  సొంత కవిత్వాన్ని వదిలారు. వాళ్ళను అలా వదిలితే బాగోదు కదా.. ఇప్పుడు ప్రభుత్వం ఆ సంస్థలు, వార్తలు రాసిన విలేకరుల మీద క్రిమినల్ కేసులు బుక్ చేస్తోంది. ఈమేరకు జిల్లా విద్యాశాఖాధికారి విస్సన్నపేట మండల విద్యాధికారికి ఉత్తర్వులు ఇస్తూ ఆయా వార్తా సంస్థల మీద  క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించారు. 

వాస్తవానికి విస్సన్నపేట జడ్పి హైస్కులును రూ. 66 లక్షలతో నాడు - నేడు పథకంలో ఆధునీకరించారు. కొత్త బెంచీలు, స్కూల్లో పచ్చదనం. శుభ్రమైన టాయిలెట్లు .. స్కూల్ చూస్తే ముచ్చటపడేలా ఉంది. అయితే ఆ పాఠశాలకు కొత్త భవనాలు, అదనపు వసతులు సమకూరడంతో కొన్ని పాత భవనాలు, అప్పట్లో నిర్మించి శిథిలావస్థకు చేరిన అస్బెస్టాస్ రేకుల భవనాలు వినియోగించకుండా వదిలేశారు.  ఈ నాల్రోజుల వరుస వర్షాలకు ఆ రేకుల భవనాల్లోకి నీరు చేరింది. అయితే సదరు పత్రికావిలేకరులు, ఛానెల్ విలేకరి కలిసి పాఠశాల ప్రారంభానికి ముందే బడి ఆవరణలోకి వెళ్లి అక్కడ ఆడుకుంటున్న పిల్లలను ఆ శిథిలావస్థలో ఉన్న గదిలోకి తీసుకెళ్లి, బలవంతాన కూర్చోబెట్టి ఫోటోలు, వీడియోలు తీసినట్లు అధికారుల విచారణలో తేలింది. అంటే అక్కడ సమస్య ఏమీ లేకున్నా ఉన్నది లేనట్లు చిత్రీకరించి వార్తను రూపొందించి జనంలోకి వదిలారు. వాస్తవానికి భిన్నంగా, ప్రభుత్వాన్ని అప్రదిష్టపాల్జేసే దురుద్దేశంతో ప్రజల్లోకి వెళ్లిన ఆ వార్తల విషయాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈమేరకు అక్కడ విచారణ జరిపి, ఆ తప్పుడు కథనాలకు బాధ్యులైన ఆ వార్త పత్రికలపై, ఛానల్స్ మీద క్రిమినల్ కేసులు బుక్ చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

Yellow media Destroying Press Integrity Misleading People :

Yellow Papers Destroying Press Integrity Misleading People By Making Fake Stories

Tags:   YELLOW MEDIA
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement