Advertisement

చంద్రబాబుకు అంత నమ్మకం, తెగువ ఉన్నాయా?

Fri 29th Apr 2016 11:29 PM
chandrababu naidu,tdp bjp,relationship,tdp,bjp,tamilnadu  చంద్రబాబుకు అంత నమ్మకం, తెగువ ఉన్నాయా?
చంద్రబాబుకు అంత నమ్మకం, తెగువ ఉన్నాయా?
Advertisement

టిడిపి, బిజెపిల మద్య ఉన్న పొత్తుకు తూట్లు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటు బిజెపి అధినాయకత్వం, అటు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుల స్థాయిల్లో విమర్శలు లేకపోయినా బిజెపికి చెందిన రాష్ట్ర నాయకులు పురందేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజులు బహిరంగంగానే చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవంక టిడిపి నేతలు కూడా బిజెపిపై మండిపడుతున్నారు. కానీ అధినాయకులు చంద్రబాబు, ప్రధాని మోడీ, అమిత్‌షావంటి వారు మాత్రం నోరుజారడం లేదు. అయినా కిందిస్దాయి నాయకులు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటూ ఉంటే నివారించాల్సిన వారు మాత్రం మౌనం వహిస్తుండటంతో తెరవెనుక వీరి ప్రోద్భలం ఉందని బాగానే అర్దం అవుతోంది. ఎన్నో కేసుల్లో నిందుతునిగా ఉన్న జగన్‌కు కేంద్రమంత్రులు అపాయింట్‌మెంట్‌ ఇవ్వడంపై టిడిపి నాయకులు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. స్వయాన టిడిపి సీనియర్‌ నాయకుడు, ఆర్థిక మంత్రి యనమల కూడా బిజెపిపై మండిపడ్డారు. ఇక టిడిపి, బిజెపిలకు రాం...రాం.. చెప్పుకుంటే నష్టపోయేది టిడిపినా, లేక బిజెపినా అంటే ఖచ్చితంగా బిజెపికే నష్టం అని చెప్పాలి. ఎంతో కొంత బలం ఉన్న తెలంగాణలోనే బిజెపికి దిక్కు లేకపోతే ఇక ఏపీలో ఆ పార్టీకి ఉన్న బలమెంత? అనే విషయం బహిరంగమే. దక్షిణాదిలో వాస్తవంగా ప్రాంతీయ పార్టీల హవా ఎక్కువే. తమిళనాదు రాజకీయాలను , తెలంగాణ రాజకీయాలనే ఉదాహరణగా తీసుకుంటే తమిళనాడులో అన్నాడీఎంకే అధినేత్రి కేంద్రంపై ఆధారపడకుండానే తన అభివృద్ది, సంక్షేమ పథకాలతో ప్రజల్లో మెప్పు తెచ్చుకుని, 2019లో తృతీయ ఫ్రంట్‌ అధికారంలోకి వస్తే ప్రధాని కావాలను కోరుకుంటోంది. ఆమెపై కూడా ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలు వచ్చినా ఆమెకు ప్రజల్లో ఉన్న క్రేజ్‌ మరింత పెరిగిందే కానీ తగ్గలేదు. ఇక తెలంగాణలో కూడా కేసీఆర్‌ కేంద్రం నుండి పెద్దగా ఏమీ ఆశించకుండా కేంద్రంలో కాంగ్రెస్‌, బిజెపిల మద్దతు లేనప్పటికీ తన పాలనతో, మాటలను అందరినీ ఆకట్టుకుంటున్నాడు. మరి వీరిద్దరి పరిస్థితి ఇలా ఉంటే చంద్రబాబు మాత్రం ప్రతి విషయానికి బిజెపికి వంగి వంగి సలామ్‌లు చేయాల్సిన పనిలేదు. ఏపీలో బిజెపికి ఉన్న పట్టు ఏమిటో? ఆయనకు ఎవ్వరూ చెపాల్సిన పనిలేదు. కానీ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కావడం, ఆర్థికలోటు ఉండటం.. ఇలాంటి బలహీనతల వల్లే చంద్రబాబు కేంద్రాన్ని ఏమాత్రం డిమాండ్‌ చేయలేకపోతున్నాడు. ఆర్దికప్యాకేజీ, ప్రత్యేకహోదా, రైల్వేజోన్‌, పోలవరం ప్రాజెక్ట్‌, రాజధానికి సాయం చేయడం వంటి అంశాలన్నీ ఏపీకి ఉన్న హక్కు. మన హక్కుల కోసం పోరాడి సాధించుకోవాలే కానీ దానికోసం బిజెపికి, తద్వారా కేంద్రానికి సలామ్‌లు చేయాల్సిన అవసరం లేదు. మహా అయితే వచ్చే ఎన్నికల్లో బిజెపి వైకాపాకు దగ్గరవుతుందనే భయం చంద్రబాబుకు ఉంది. కానీ రాష్ట్రంలో టిడిపికి ఎంత వ్యతిరేకత ఉందో, కేంద్రంలో బిజెపి పట్ల కూడా అంతే వ్యతిరేకత ఉంది. చంద్రబాబు తన పనితీరు మీద, నిజాయితీ మీద, సంక్షేమ పథకాల మీద, అభివృద్దిపై నిజంగా తనకు నమ్మకం ఉంటే, తనమీద తనకి విశ్వాసం ఉంటే ఏపీ ప్రజలను అవమానపరిచే విధంగా బిజెపిని బిక్షం అడుక్కోవాల్సిన పనిలేదు. ఆయన మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హోదా వంటి వాటిపై కేంద్రంపై పోరాటానికి దిగితే యావత్తు ఏపీ ప్రజలకు ఆయనకు అండగా ఉంటారు. దీనికి ఎంతో ధైర్యం, తెగువ కావాల్సి ఉంది. మరి చంద్రబాబుకు అంత ధైర్యం,నమ్మకం ఉన్నాయా? అన్నదే ప్రశ్న. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement