ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Shefali Shah Recalls Mother's 'Protective' Nature

ఇల్లు లేక గ్యారేజీలో తలదాచుకున్నాం!

Shefali Shah Recalls Mother's 'Protective' NatureShefali Shah Recalls Mother's 'Protective' Nature

బాలీవుడ్ నటి షెఫాలి షా బాల్యానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర‌ విషయాలను తాజాగా రివీల్ చేసారు. ఓ సాహిత్య వేడుకలో పాల్గొన్న  షెపాలి ఏకైక సంతానంగా పెరిగిన వైనం గురించి..  తల్లిదండ్రులు తనను ఎలాంటి రక్షణ వాతావరణంలో పెంచారో గుర్తు చేసుకున్నారు. చిన్నతనంలో తనపై ఉన్న  రక్షించే గుణం వల్ల తనకు చిన్నప్పుడు అసలు స్నేహితులే ఉండేవాళ్ళు కాదని  తెలిపారు.  తల్లిదండ్రులు తనను  కంటికి రెప్పలా కాపాడ‌టం వల్ల తోటివారితో కలిసి తిరిగే అవకాశం రాలేదన్నారు.

ఒంటరిగా పెరగడం వల్ల పాఠశాల రోజుల్లో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నానని షెఫాలి షా వెల్లడించారు. తన తల్లి తనకే అత్యుత్తమ స్నేహితురాలు కావడంతో బయట  ఫ్రెండ్స్ అవసరం రాలేదని.. కానీ స్కూల్‌లో మాత్రం తనను ఎవ‌రూ ప్రత్యేకంగా ఇష్టపడేవారు కాదన్నారు. కొంతమంది విపరీతంగా వేధించేవారని.. అసలు ఎలాంటి కారణం లేకుండానే ఇక అమ్మాయి తనను చూసినప్పుడల్లా కొట్టేదని నాటి రోజులను గుర్తుచేసుకున్నారు. అయితే  తల్లి మాత్రం `నువ్వు వాళ్ళకంటే చాలా మెచ్యూర్ష‌` అని చెప్పి  ఓదార్చేవారని.. ఆ సమయంలో తనలో ఆత్మవిశ్వాసం పెరిగినప్పటికీ త‌న‌ వయసువారితో కలిసి తిరిగే అనుభూతి మాత్రం లోపించిందని తెలిపారు.

ఆ తర్వాత తానే స్వయంగా తల్లి అయిన తర్వాతే తల్లిదండ్రులు పడిన కష్టాలు, తమను పెంచడానికి వారు చేసిన త్యాగాలు అర్థమయ్యాయని షెఫాలి భావోద్వేగానికి గురయ్యారు. తాము దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చామని.. ఒక సమయంలో సొంత ఇల్లు కూడా లేక  తండ్రి బంధువుల దగ్గర ఉంటూ తానూ తల్లి గ్యారేజీలో ఉండేలా సర్దుబాటు చేసుకున్నారని తెలిపారు. అయినా తమకు మంచి విలువలు నేర్పించారని.. తాను ఈ స్థాయికి రావడానికి తల్లిదండ్రుల ప్రోత్సాహమే కారణమని కొనియాడారు.

Shefali Shah: Growing up, I was protected so fiercely that I did not have any friends