స్టార్ కిడ్ అయినా ఒదిగి ఉండే గొప్ప నటుడు!
Allu Arjun praises Dulquer Salmaan
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాలీవుడ్ స్టార్ దుల్కర్ సల్మాన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. పవన్ సాధినేని దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న తాజా చిత్రం `ఆకాశంలో ఒక తార` ప్రీ-రిలీజ్ వేడుకకు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుల్కర్ సల్మాన్ ఎంచుకునే కథలు, ఆయన కెరీర్ గ్రాఫ్ ఎంతో వైవిధ్యంగా ఉంటాయని కొనియాడారు.
స్టార్ కిడ్ అయినప్పటికీ దుల్కర్ ఎంతగానో ఒదిగి ఉంటారని.. ఆయనలోని వినయపూర్వకమైన స్వభావం తనను ఆకట్టుకుంటుందని బన్నీ తెలిపారు. ఈ చిత్రంలో కథాంశం అద్భుతంగా ఉందని అర్జున్ ప్రశంసించారు. ప్రతి మహిళ కలను నిజం చేయాలనే ప్రధాన పాయింటు చుట్టూ కథ తిరుగుతుందని..టీజర్ చూసినప్పుడే తనకు ఆ పాజిటివ్ వైబ్ సోల్ స్పష్టంగా కనిపించిందన్నారు. ఈ సినిమాలో భాగమైన శృతి హాసన్, రుహిణి శర్మతో పాటు నూతన నటి సత్విక వీరవల్లికి శుభాకాంక్షలు తెలిపారు.
కమర్షియల్ స్టార్ హీరోయిన్ అయినా? శృతి హాసన్ ఈ ప్రాజెక్ట్‌కు మద్దతుగా ప్రత్యేక పాత్రలో నటించడం అభినందనీయమన్నారు. పవన్ సాధినేని పనితీరును నిర్మాత స్వప్న దత్, సందీప్ గున్నంల కృషిని బన్నీ అభినందించారు. ఈ కార్యక్రమంలో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ తాను కేరళలో తన మొదటి సినిమా షూటింగ్ సమయంలో పిల్లలు అల్లు అర్జున్ పేపర్ కటింగ్స్‌ను గదిలో ఉంచుకోవడం చూశానని.. ఆయనకున్న ఫాలోయింగ్ గురించి గుర్తు చేసుకున్నారు. `ఆకాశంలో ఒక తార` తన కెరీర్‌లోనే ప్రత్యేకమైన చిత్రమని.. ఈ సినిమా కోసం అల్లు అరవింద్ గారు ఎంతగానో శ్రమించారని తెలిపారు.
















































