ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Ajith Kumar's Dare Devil: Shivarajkumar To Play Villain

అజిత్ కి విలన్ గా స్టార్ హీరో!

Ajith Kumar's Dare Devil:  Shivarajkumar To Play VillainAjith Kumar's Dare Devil: Shivarajkumar To Play Villain


కోలీవుడ్ స్టార్ అజిత్ హీరోగా రీసెంట్ గా మొదలైన డేర్ డెవిల్ చిత్రాన్ని అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో అజిత్ ఓన్ ప్రొడక్షన్ లోనే నిర్మిస్తున్నారు. ఈమధ్యనే పూజా కార్యక్రమాలతో మొదలైన డేర్ డెవిల్ చిత్రంలో క్యూట్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నట్టుగా కన్ ఫర్మ్ చెయ్యడమే కాదు శ్రీలీల డేర్ డెవిల్ ఓపెనింగ్ కార్యక్రమాల్లోనూ పాల్గొంది.

తాజాగా అజిత్ కి విలన్ గా కన్నడ స్టార్ హీరో నటించబోతున్నారనే వార్త వైరల్ అవడమే కాదు.. ఆ విషయాన్ని కోలీవుడ్ మీడియా నొక్కి వక్కాణిస్తుంది. అజిత్ కి విలన్ గా డేర్ డెవిల్ కోసం కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కనిపించబోతున్నారని, దర్శకుడు అధిక్ రవిచంద్రన్ కథ చెప్పగానే శివ రాజ్‌కుమార్ వెంటనే అంగీకరించారని, ఆ తర్వాత అజిత్ కూడా స్వయంగా ఆయనతో మాట్లాడారని సమాచారం.

ప్రస్తుతం డేర్ డెవిల్ షూటింగ్ హైదరాబాద్‌లో రాత్రిపూట చిత్రీకరిస్తున్నారు. రెండు మూడు రోజుల్లో శివ రాజ్ కుమార్ డేర్ డెవిల్ సెట్ లో  తెలుస్తుంది. జైలర్ 2 లో గెస్ట్ రోల్ చేసిన శివరాజ్ కుమార్ రామ్ చరణ్ పెద్దిలోను కీ రోల్ ప్లే చేసారు. ఇప్పడు అజిత్ కి విలన్ గా రాబోతున్నారు.

Shivarajkumar To Play Villain For Dare Devil