ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Biggboss telugu season 10 winner Thrigun confirm

బిగ్ బాస్ 10 విన్నర్ త్రిగుణ్ ?

Biggboss telugu season 10 winner Thrigun confirmBiggboss telugu season 10 winner Thrigun confirm


బిగ్ బాస్ సీజన్ 10 విన్నర్ పై ఫ్యామిలీ వీక్ తోనూ, ఈ వీకెండ్ గెస్ట్ ల ఎపిసోడ్ తోనూ అందరిలో ముఖ్యంగా హౌస్ మేట్స్ కి, ఆడియన్స్ కి ఓ క్లారిటీ వచ్చినట్టే కనిపిస్తుంది. నిన్నటివరకు త్రిగుణ్ అన్న దూత అంటూ కొంతమంది సరదాగా ఆటపట్టిస్తే.. రోహిత్, ముఖేష్ లాంటి వాళ్ళు త్రిగుణ్ డామినేషన్ తట్టుకోలేకపోయారు.

త్రిగుణ్ మాటకారి, ఆటకారి.. కానీ నోటి దూల. అదొక్కటి లేకపోతె ఈ సీజన్ మొదటి వారం నుంచే త్రిగుణ్ నెంబర్ 1 ప్లేస్ లోనే ఉండేవాడు. అగ్నిపరీక్షతో హైప్ ఎక్కించుకుని హౌస్ లోకి వచ్చి త్రిగుణ్ ని టార్గెట్ చేసే క్రమంలో ఆటను కోల్పోయి హౌస్ మేట్స్ చేతిలో బుక్ అయ్యి అనుకోకుండా రోహిత్ ఎలిమినేట్ అవ్వకపోతే త్రిగుణ్ కి గట్టిపోటీ ఉండేది.

ముఖేష్ గౌడ త్రిగుణ్ తో పోటీపడినా.. ఆట వరకే, కానీ మాట విషయంలో త్రిగుణ్ ముందు తేలిపోతున్నాడు, ఫ్యామిలీ వీక్ లో ఎవరి ఫ్యామిలీ హౌస్ లోకి వచ్చినా వాళ్ళు త్రిగుణ్ ని మెచ్చుకోవడమే కాదు, అతను వారికీ చేసిన మర్యాదలు అతన్ని మరో మెట్టు ఎక్కించాయి.

ఇక వీకెండ్ ఎపిసోడ్ లో ఎవరి ఫ్రెండ్స్ వచ్చినా, ఫ్యామిలీ వచ్చినా త్రిగుణ్ ని టాప్ 3 లో పెట్టి వంటి నిండా నిండిపోయే స్టార్స్ ఇచ్చారు. ఆర్వాత ముఖేష్ కి స్టార్స్ వచ్చినా ఓవరాల్ షో త్రిగుణ్ మాత్రమే హైలెట్ అయ్యాడు.. ప్రతి ఒక్కరూ అతను ఆట, మాట గురించి అభినందించడమే. ఈ లెక్కన త్రిగుణ్ సీజన్ 10 అని ఫిక్స్ అవ్వొచ్చు, ఒకవేళ విన్నర్ అయినా ఆశ్చర్యపడక్కర్లేదు కూడా. 

Bigg Boss Telugu 10: Thrigun has confirmed as the winner