ఆ డైరెక్టర్ కి పెద్ద షాకే !

A big shock for that director!A big shock for that director!

 

గుంటూరు కారం తర్వాత అల్లు అర్జున్ తో కమిట్ అయిన సినిమా ఆగిపోయింది. అది గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ కి పెద్ద షాక్. అలా వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ ఉన్నా గుంటూరు కారం రిజల్ట్, అలాగే త్రివిక్రమ్ చెప్పిన మైథలాజికల్ స్టోరీ నచ్చలేదు అల్లు అర్జున్ కి, అందుకే అల్లు అర్జున్ త్రివిక్రమ్ ని పక్కనపెట్టి.. వరసగా కోలీవుడ్ డైరెక్షన్స్ కి కమిట్ అయ్యారు.

అదే మైథలాజికల్ కథ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని ఒప్పించి మూవీ అనౌన్సమెంట్ వచ్చేలా చేసారు త్రివిక్రమ్. హరికా హాసిని క్రియేషన్ లో, కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ లో ఈ మూవీని ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆదర్శ కుటుంబం రిజల్ట్ తర్వాత ఎన్టీఆర్ ఆలోచనలు మారింది. అందుకే త్రివిక్రమ్ సినిమాని పక్కనపెట్టి అనిల్ రావిపూడి తో కామెడీ ఫిలిం ని అనౌన్స్ చేసారు.

అంటే త్రివిక్రమ్ సినిమాని ఆపేశారని కాదు, ఆదర్శ కుటుంబం రిజల్ట్ తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో సినిమా చేస్తే హోప్స్ ఉండవని భావించి దానికన్నా ముందు అనిల్ రావిపూడితో సినిమా చేసేలా ఎన్టీఆర్ ప్లాన్ చేసుకుంటున్నారు. అంటే త్రివిక్రమ్ ఎన్టీఆర్ ఫ్రీ అయ్యేలోపు మరో సినిమా చేసి హిట్ కొట్టాల్సిందే.

ఇది నిజంగా త్రివిక్రం కి పెద్ద షాక్ అనే చెప్పాలి. మరి త్రివిక్రమ్ ఎన్టీఆర్ కోసం ఎన్నాళ్ళు వెయిట్ చెయ్యాల్సి ఉంటుందో చూడాలి.

Big shock for the director Trivikram