తండ్రి-కొడుకుల బాక్సాఫీసు వార్
Interesting: Father-Son Box Office War
ఈవారం టాలీవుడ్ బాక్సాఫీసు దగ్గర ఇంట్రెస్టింగ్ వార్ జరగబోతుంది. అది కూడా క్రేజీ నటులైన తండ్రి-కొడుకుల మధ్యన వార్ అన్నమాట. మలయాళ స్టార్స్ మమ్ముట్టి ఆయన కొడుకు దుల్కర్ సల్మాన్ నడుమ బాక్సాఫీసు దగ్గర క్రేజీ ఫైట్ ఈ నెల 20 అంటే ఈశుక్రవారమే జరగబోతుంది.
మమ్ముట్టి తమిళలనాట నటించిన ఓం ఈ శుక్రవారం తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ధనుష్ హీరోగా తెరకెక్కిన ఓం చిత్రంలో మమ్ముట్టి విలన్ గా కనిపిస్తున్నారు. ఇక తెలుగులో దుల్కర్ సల్మాన్ నటించిన ఆకాశంలో ఒక తార కూడా రేపు శుక్రవారమే విడుదల కాబోతుంది.
ప్రస్తుతం ఈ చిత్రంపైనా మంచి అంచనాలున్నాయి. దుల్కర్ హీరోయిన్ న్ తో కలిసి ఆకాశంలో ఒక తారను బాగా ప్రమోట్ చేస్తున్నాడు. నిన్న ఈ సినిమా ఈవెంట్ కి బన్నీ అల్లు అర్జున్ గెస్ట్ గా వచ్చారు. ఈరోజు ఓం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరగబోతుంది. మరి ఈ వారం తండ్రి-కొడుకుల క్రేజీ బాక్సాఫీసు వార్ లో గెలుపెవరిదో చూడాలి.
















































