పెళ్ళికి ముందే బ్రేకప్ చేసుకోవాలనుకున్న జంట
We Were In Different Phases Of Life': Kiara Advani And Sidharth
పెళ్ళికి ముందు ఎంతో ఘాడంగా ప్రేమించుకుని.. పెళ్లిని సైతం గ్రాండ్ గా చేసుకుని.. ఆ సంసారం బంధంలో ఇమడలేక.. భార్య భర్తల నడుమ వస్తున్న వివాదాలను పరిష్కరించుకోలేక విడిపోతున్న జంటలు, ముఖ్యంగా సెలెబ్రిటీ జంటలు ఎన్నో ఉన్నాయి. సామాన్యుల కన్నాసెలెబ్రిటీ జంటలైతే అదో సెన్సేషనల్ న్యూస్ గా మారుతుంది.
పెళ్లికి ముందే ప్రేమలో ఉన్నప్పుడు ఆ ప్రేమ బంధాన్ని పెళ్లి వరకు తీసుకుకెళ్ళకుండానే బ్రేకప్ చెప్పుకుని విడిపోయే జంటలు కూడా చాలానే ఉన్నాయి. అయితే పెళ్ళికి ముందు బ్రేకప్ చెప్పుకోవాలని అనుకుని ఆ సమస్యను దాటి వివాహంతో ఒక్కటై ఇప్పుడు ఎంతో అన్యోన్యంగా ఉంటున్న కియారా అద్వానీ-సిద్దార్థ్ మల్హోత్రా జంట తాజాగా కరణ్ విత్ కాఫీ షో లో కొన్ని విషయాలను షేర్ చేసుకున్నారు.
పెళ్ళికి ముందు తాము డేటింగ్ లో ఉన్న సమయంలో సిద్దార్థ్ ఎక్కువగా కెరీర్ గురించి ఆలోచించడంతో.. తనకు ఇబ్బందిగా అనిపించి ఉంటె పూర్తిగా ప్రేమలో ఉండాలి, లేదంటే తెగ తెంపులు చేసుకోవాలని అనుకున్నప్పుడు ఆ వేదన సిద్దార్థ్ మల్హోత్రా భరించలేపోయాడని, తీవ్రమైన జ్వరంతోనే నా కారవాన్ లోకి వచ్చి పూలతో తనికి ప్రపోజ్ చేసి మా బంధాన్ని నిలిపాడని.. అందుకే ఇప్పుడు వివాహం బంధంలో తాము చాలా దృఢంగా ఉన్నామని చేబుతుంది.
ప్రస్తుతం కియారా మరోసారి ప్రెగ్నెంట్ అయ్యింది, ఇప్పటికే ఈ జంటకు ఓ పాప. ఇపుడు కియారా వెంటనే మరో గుడ్ న్యూస్ షేర్ చేసింది.
















































