రామాయణ: 8 రోజులు రూ 1000 కోట్లు

Ramayana Collection ReportRamayana Collection Report


నితీష్ తివారి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బాలీవుడ్ రామాయణ ఇప్పుడు సంచలనాలకు నెలవుగా మారింది. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీత గా, యశ్ రావణ్ గా నటించిన రామాయణ ఇండియా బాక్సాఫీసుపై దాడి చేస్తుంది. ఇండియా నుంచి ఓవర్సీస్ వరకు రామాయణ హవా నడుస్తుంది.

గత గురువారం విడుదలైన రామాయణ చిత్రానికి ప్రజలు పట్టాభిషేకం చేస్తున్నారు. రామాయణ చిత్రం కేవలం 8 రోజుల్లోనే రూ.1000 కోట్ల గ్రాస్ మార్కును దాటే దిశగా దూసుకెళ్తూ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. మరి భారీ బడ్జెట్ తో తెరకెక్కిన రామాయణ ఇంత భారీ వసూళ్లు చేస్తుంది అని ఎవరూ ఎక్స్పెక్ట్ చేసి ఉండరు.

రామాయణకు కొని డ్రా బ్యాంక్స్ ఉన్నాయి. సీత గా సాయి పల్లవిపై విమర్శలు, రామాయణ నిడివి కాస్త ఇబ్బంది పెట్టినా అది ప్రేక్షకులు పట్టించుకోలేదు. మౌత్ టాక్ మాత్రమే కాదు సినీవిమర్శకులు సైతం రామాయణకు అద్భుతమైన రేటింగ్స్ ఇవ్వడం, ఆడియన్స్ ఆహా ఓహో అనడమే ఈ రేంజ్ కలెక్షన్స్ రావడానికి కారణమైంది,

Ramayana 8 days collections