డెబ్యూతోనే రూ.40 కోట్ల బెట్
Itlu Arjuna budget revealed
సినీరంగం నుంచి వస్తున్న వారసులను తొందరగా ఆడియన్స్ కు చేరువ చెయ్యాలనే కలతో వారి తండ్రులు ఏరికోరి దర్శకులను ఎంచుకుని, భారీ బడ్జెట్ పెట్టి మరీ ఇండస్ట్రీకి పరిచయం చేస్తారు. రామ్ చరణ్, అల్లు అర్జున్, అఖిల్, బెల్లంకొండ ఇలా చాలామంది సినిమా ఇండస్ట్రీకి వచ్చిన వారసులు మంచి బడ్జెట్ తో పేరున్న దర్శకులతోనే డెబ్యూ మూవీస్ చేసారు.
అయితే సినీరంగానికి పరిచయం లేదు అని చెప్పలేం కానీ.. ఇప్పుడు డెబ్యూ హీరోగా ఇండస్ట్రీకి ఇట్లు అర్జున తో పరిచయం అవుతున్న ఓ హీరో రూ.40 కోట్ల బెట్ తో బరిలోకి దిగుతున్నాడు. అతనే అనీష్. అనీష్ ఊరు, పేరు ఎవ్వరికి తెలియదు, పోనీ ఫాదర్ బ్యాక్ రౌండ్ కూడా అంతగా తెలియదు. కానీ ఈ హీరో వెనుక పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు.
నాగార్జున ఇట్లు అర్జున కు ప్రెజెంటర్ గా ఉంటె.. ఎన్టీఆర్, రామ్ చరణ్, అఖిల్ వంటి వారు అనీష్ తెరకు పరిచయమవుతున్న ఇట్లు అర్జునను తెగ ప్రమోట్ చేసారు. ఈ హీరో డెబ్యూ సినిమా ఇట్లు అర్జున కోసం మేకర్స్ సినిమా మేకింగ్ అలాగే ప్రమోషన్స్ కి కలిపి ఏకంగా రూ.30 నుంచి రూ.35 కోట్ల మేర ఖర్చు చేసినట్టు తెలుస్తుంది.
మరి ఓ డెబ్యూ హీరోపై దాదాపుగా రూ.40 కోట్ల బెట్ అంటే మాములు విషయం కాదు. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రమోషన్స్ ఎంతవరకు కాసులు రాలుస్తాయో తెలియదు కానీ.. ఇట్లు అర్జున్ పై ప్రస్తుతం ఆడియన్స్ లో అటెన్షన్ కనిపిస్తుంది. చూద్దాం అనీష్ రూ.40 కోట్ల బెట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో అనేది మరికాసేపట్లో తేలిపోతుంది.
















































