బాలీవుడ్ నటులకు ముంబై పోలీసులు వార్నింగ్!
Mumbai Police issue warning to Bollywood actors!
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాలీవుడ్ స్టార్స్ ని టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో ముంబై పోలీసులు సెలబ్రిటీస్ కి వార్నింగ్ ఇస్తున్నారు. బిష్ణోయ్ గ్యాంగ్ తో జాగ్రత్తగా ఉండండి, అభిమానులతో కాస్త దూరంగా ఉండమని చెబుతున్నారు పోలీసులు. ఈమధ్యన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కదలికలు ఎక్కువైన నేపథ్యంలో ముంబై పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.
సల్మాన్ ఖాన్ టార్గెట్ గా జరిగిన కాల్పుల్లో మరో హీరో టైగర్ ష్రాఫ్ గాయపడడం, ఆతర్వాత అమితాబ్ ఇంటికి అలాగే ముంబై హై కోర్టుకి బాంబ్ బెదిరింపులు రావడంతో అలెర్ట్ అయిన పోలీసులు బాలీవుడ్ సెలబ్రిటీస్ కి వార్నింగ్ ఇస్తున్నారు. పబ్లిక్ లో తిరగొద్దని, ఫ్యాన్స్ తో కూడా దూరంగా ఉండమని చెబుతున్నారు.
ఇప్పటికే బాలీవుడ్ స్టార్స్ బయటకు రావడానికి భయపడుతున్నారు. అంతేకాదు సెక్యూరిటీ ని పెంచుకుని కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్యనే వారు అడుగు బయటపెడుతున్నారు.















































