సైలెంట్ గా పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్
Irumudi Heroine is Married
తెలుగులో రవితేజ భార్యగా ఇరుముడి చిత్రంతో ప్రేక్షకుల్లో బలమైన ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ప్రియా భవాని శంకర్.. ఇకపై సినిమా అవకాశాలతో ఉక్కిరి బిక్కిరి అవుతుంది అనుకున్న సమయంలో ఆమె సీక్రెట్ గా నిశ్చితార్ధం చేసుకున్న ఫోటో బయటకు రావడం సంచలనంగా మారింది. నవంబర్ 10 న ప్రియా భవాని శంకర్ నిశ్చితార్ధం జరిగిందా అని మట్లాడుకునేలోపు..
నవంబర్ 11న ఆమె తన బాయ్ ఫ్రెండ్ రాజ్ ని వివాహమాడుతున్న వీడియో, అలాగే ఫొటోస్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. కొద్ది మంది సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో ప్రియా భవాని శంకర్-రాజ్ ల వివాహం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కొంతకాలంగా రావెల్ రాజన్ అనే వ్యక్తితో ప్రేమలో ఉన్న ప్రియా భవానీ శంకర్ అతడితో నిశ్చితార్ధం చేసుకున్న విషయం కానీ, ఈరోజు పెళ్లి జరగబోతుంది అనే విషయం కానీ ఎక్కడా రివీల్ చెయ్యలేదు. ప్రియా, రాజ్‌లకు కాలేజీ రోజుల నుంచే పరిచయం ఉంది, సినిమాల్లో ప్రియా కెరీర్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ వీరిద్దరూ పదేళ్లకు పైగా డేటింగ్ చేస్తూ తమ బంధాన్ని స్థిరంగా కొనసాగిస్తున్నారు. ఇప్పుడు పెళ్లి తో ఒక్కటయ్యారు.















































