కష్టాల్లో ఉన్నవారిని తొక్కడం అమానుషం!
Renu Desai Supports Pawan Kalyanఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ - సతీమణి అన్నా కొనిదెల విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. పరస్పర అంగీకారంతో విడిపోతున్నామని.. భవిష్యత్తులోనూ స్నేహితులుగా కొనసాగుతూ తల్లిదండ్రుల బాధ్యతలను నిర్వర్తిస్తామని సంయుక్తంగా వెల్లడించారు. ఈ నిర్ణయం టాలీవుడ్ వర్గాలతో పాటు రాజకీయ ప్రముఖుల్లోనూ తీవ్ర చర్చనీయాంశమైంది.
ఈ పరిణామాల నేపథ్యంలో పవన్ కల్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఎవరి పేరునూ నేరుగా ప్రస్తావించకుండా ఆమె పంచుకున్న ఓ డీప్ అండ్ ఎమోషనల్ నోట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఎవరైనా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారిని మరింతగా విమర్శించడం .. ట్రోల్ చేయడం సరికాదని, ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్నవారిని మానసికంగా వేధించడం అమానుషమని హితవు పలికారు.
సమాజంలో ప్రతి ఒక్కరూ ఎవరో ఒకరికి బిడ్డలని, తల్లిదండ్రులని .. తోబుట్టువులని గుర్తుంచుకోవాలని రేణు దేశాయ్ కోరారు. సాటి మనుషుల పట్ల దయ, సానుభూతి చూపడం అత్యంత అవసరమన్నారు. ఇలాంటి సమయాల్లో అభిమానులు ఒకర్నే టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ పవన్ అభిమానుల నుంచి రేణు దేశాయ్ ఎలాంటి విమర్శలు ఎదుర్కుంటున్నారో తెలిసిందే. ఆ బాధను అన్నా లెజ్నివా పడకూడదనే ఉద్దేశంతోనే రేణు దేశాయ్ అభిమానులకు ఆ రకంగా పిలుపునిచ్చారు.















































