రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్న హీరోయిన్ ?
Priya Bhavani Shankar to marry longtime boyfriend
తమిళ చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రియా భవానీ శంకర్ పెళ్లి వార్తలపై కోలీవుడ్ సర్కిల్స్‌లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత టెలివిజన్ సీరియల్స్ ద్వారా పాపులర్ అయి ప్రస్తుతం స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న బ్యూటీ వ్యక్తిగత జీవితం తాజాగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
కొంతకాలంగా రావెల్ రాజన్ అనే వ్యక్తితో ప్రేమలో ఉన్న ప్రియా భవానీ శంకర్ అతడితో కలిసి దిగిన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో రూమర్స్ ఊపందుకున్నాయి. ఈ పిక్చర్స్‌లో ప్రియా ఆలివ్ గ్రీన్ శారీలో ట్రెడిషనల్ లుక్‌లో కనిపించగా.. రావెల్ రాజన్ ట్రెడిషనల్ షర్ట్ ధరించారు. ముఖ్యంగా ఇద్దరు మెడలో పూల దండలు, నుదుటిపై గంధం బొట్లు ఉండటంతో ఇవి ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లేదా ఎంగేజ్మెంట్ ఫోటోలని నెటిజన్లు గట్టిగా భావిస్తున్నారు.
అయితే ఈ వైరల్ ఫోటోలపై ఇప్పటివరకు ప్రియా భవానీ శంకర్ గానీ.. ఆమె బృందం గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇది నిజంగానే వారి వివాహ వేడుకకు సంబంధించినదా లేక మరేదైనా ఫంక్షన్‌లోనిదా అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. సినిమాల పరంగా చూస్తే.. ప్రస్తుతం ఈ అమ్మడు `డిమాంటె కాలనీ 3` చిత్రంతో పాటు పలు క్రేజీ ప్రాజెక్ట్‌లతో ఫుల్ బిజీగా ఉన్నారు. త్వరలోనే ఈ బ్యూటీ పెళ్లిపై వస్తున్న వార్తలపై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.















































