ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> New twist in actress Atulya Chandra case

అతుల్య చంద్ర కేసులో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ లు

New twist in actress Atulya Chandra caseNew twist in actress Atulya Chandra case

 


మలయాళంలో నటి అతుల్య చంద్ర కేసు లో రోజుకో ట్విస్ట్ హాట్ టాపిక్ గా మారుతుంది. అతుల్య చంద్ర డాక్టర్ జాన్సన్ కె. వర్గీస్ పై దాడి చేసి, కిడ్నాప్ చేసి మూడు కోట్లు డిమాండ్ చేసారు అనే కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈకేసులో అతుల్య చంద్ర నిర్దోషి కానప్పటికీ.. డాక్టర్ జాన్సన్ కె. వర్గీస్ ఏమి అమాయకుడు కాదు. అతనొక దుర్మార్గుడు, నీచుడు అనే విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

జాన్సన్ కె. వర్గీస్ పై రేప్ కేసు నమోదు కావడంతో పోలీసులకు దొరక్కుండా డాక్టర్ జాన్సన్ కె. వర్గీస్ విదేశాలకు పారిపోయినట్లుగా చెబుతున్నారు. అతుల్య చంద్ర ఆంటీ ని ఆ డాక్టర్ లైంగికంగా వేధించాడని, రేప్ చేసాడని ఆమె కేసు పెట్టగా, పోలీసులు కేసు నమోదు చేసి జాన్సన్ కె. వర్గీస్ ని అరెస్ట్ చేసే లోపే అతను విదేశాలకు పారిపోయినట్లుగా చెబుతున్నారు.

ఆ డాక్టర్ మొబైల్ ఫోన్ లో విస్తుపోయే దారుణాలు రికార్డ్ చేసినట్లుగా, డాక్టర్ ఫోన్లోని అశ్లీల వీడియోలు, ఆధారాలతోనే అతుల్య ఆంటీ ఇన్ఫోపార్క్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తుంది. సెలబ్రిటీల హనీట్రాప్, బ్లాక్ మెయిల్ కోణంలో మొదలైన ఈ కేసు.. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసిన డాక్టరే ఒక రేపిస్ట్ అని తేలడం, అతడు పారిపోవడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.


మరోపక్క డాక్టర్ ని బంధించి అతనిపై దాడి చేసి కోట్లు డిమాండ్ చేశారనే కేసులో అతుల్య చంద్ర, నటుడు బిపిన్ పెరుంబిల్లి, డ్రైవర్ కె.బి. విష్ణులను కడవంత్ర పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. 
 

A massive twist in the Kochi doctor attack case