నయన్ లెక్క తప్పింది
Mookuthi Amman 2 is a disaster on Box-office
కోలీవుడ్ లోనే కాదు సౌత్ లోనే పారితోషికం విషయంలో నెంబర్ 1 స్థానంలో ఉంది లేడీ సూపర్ స్టార్ నయనతార. చాలా అలోచించి సినిమాలు చేస్తుంది. కానీ ఈ ఏడాది నయనతార లెక్క తప్పింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలు ఆమెకు వరసగా షాక్ ఇచ్చాయి.
అటు భర్త విగ్నేష్ కి కూడా ఈ ఏడాది LIK తో ఘోరంగా పరాజయం వెంటాడింది. తనకు హిట్స్ లేవు, అటు భర్త కూడా డిజప్పాయింట్ మోడ్ లోనే ఉన్నాడు. రీసెంట్ గా నయనతార నటించిన మూకుతి అమ్మన్ 2 డిజాస్టర్ లిస్ట్ లో చేరేందుకు రెడీ అయ్యింది. దారుణమైన కలెక్షన్స్ మూకుతి అమ్మన్ 2 వస్తున్నాయి.
సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కిన మూకుతి అమ్మన్ 2 తెలుగులో మహాశక్తిగా విడుదలైంది. ఏ నయనతార ఇమేజ్ ని చూసుకుని తెలుగులో డబ్ చేసి విడుదల చేసారో.. ఆ నయన్ ఇమేజ్ కనీసం ఓపెనింగ్స్ తీసుకురాలేదు. నయనతార ఇమేజ్ మూకుతి అమ్మన్ 2 ని కాపాడలేకపాయింది. సినిమాలో ఎంతోకొంత దమ్ము ఉంటె ఆడుతుంది.
ఎంత లేడీ సూపర్ స్టార్ ఉంటే మాత్రం మూడు గంటలు ప్రేక్షకులు భరించాలంటే ఎంత సహనం కావాలి. మరి నయనతార లెక్క ఎక్కడ తప్పిందో చూసుకుని, ఈసారి అది రిపీట్ కాకుండా ఉండాలి.
















































