శ్రీలీల: చూపు తిప్పుకోలేని అందం
Sreeleela Turns Heads with Her Stunning Beauty
స్వీట్ అండ్ క్యూట్ బ్యూటీ శ్రీలీల అందం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చీర కట్టినా, మోడ్రెన్ డ్రెస్ వేసినా శ్రీలీల అందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. శ్రీలీల ఎంత గ్లామర్ షో చేసినా అస్సలు ఎబ్బెట్టుగానే అనిపించదు. తాజాగా వైట్ మోడ్రెన్ కాస్ట్యూమ్ లో శ్రీలీల అందం మరింత ద్విగుణీకృతం అయ్యింది.
వైట్ డ్రెస్ లో కొంటె చూపులతో దివాళి వెలుగులతో మెరిసిపోయిన శ్రీలీల ని చూసిన వారు చూపుతిప్పుకోలేరు అంటే నమ్మాల్సిందే. బాలీవుడ్ లో జరిగిన మనీష్ మల్హోత్రా దివాళి పార్టీలో శ్రీలీల స్టైలిష్ లుక్ వైరల్ అవుతుంది. ప్రస్తుతం శ్రీలీల కు తెలుగులో ఆఫర్స్ లేవు అంతే.. కోలీవుడ్, బాలీవుడ్ రెండు చోట్ల క్రేజీ ప్రాజెక్ట్స్ తో శ్రీలీల చాలా బిజీగా వుంది.
గత రాత్రి చెన్నై లో జరిగిన ఓం ఆడియో లాంచ్ వేడుకలో శ్రీలీల చీర కట్టులో మెస్మరైజ్ చేసింది. అంతేకాదు ఈ మధ్యనే అజిత్ హీరోగా మొదలైన డేర్ డెవిల్ చిత్రంలో శ్రీలీల హీరోయిన్, అలాగే రజినీకాంత్ ధర్మన్ లోను శ్రీలీల నటిస్తుంది. బాలీవుడ్ లోను శ్రీలీల రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ లో సత్తా చాటేందుకు రెడీ అవుతుంది.
















































