తెలుగులో రామాయణ కి అడ్వాంటేజ్ అదే!
That is the advantage for Ramayana in Telugu!
టాలీవుడ్ లో రామాయణ చిత్రాన్ని దిల్ రాజు బ్యానర్ పై రిలీజ్ చేసారు. రామాయణ చిత్రాని కి తెలుగులో మంచి రెస్పాన్స్ కనిపిస్తుంది ఎన్నిసార్లు రామాయణాన్ని వీక్షించినా తెలుగు ప్రేక్షకులు మళ్లీ మళ్లీ రామాయణ చిత్రాన్ని కొత్తగా చూసేందుకు ఆసక్తి చూపుతారు అనడానికి హిందీ రామాయణ నే పెద్ద ఉదాహరణ.
రామాయణ చిత్రానికి తెలుగు లో అడ్వాంటేజ్ ఏమిటి అంటే ఈ వారం రామాయణ తో పాటుగా విడుదలైన సూర్య సీన్ చిత్రానికి యావరేజ్ రెస్పాన్స్ కనిపిస్తుంది. కరుప్పు, విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న సూర్య తాజా చిత్రం సీన్ వల్ల రామాయణ కు ఎఫెక్ట్ అవుతుంది అనుకున్నారు. కానీ ఆ చిత్రానికి యావరేజ్ టాక్ రావడం రామాయణకు కలిసొచ్చింది.
అలాగే సమ్మర్ హాలిడేస్ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చినా.. చిన్న చిత్రం కావడంతో.. ఆ సినిమా చూసేందుకు ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్లేందుకు ఆసక్తి చూపరు. ఇక నయనతార మహాశక్తి తెలుగులో ప్రేక్షకులకు ఎక్కడా రీచ్ అవ్వలేదు. సో రామాయణ కు ఎలాంటి పోటీ లేకుండా ఈ వారం తెలుగులో ఫుల్ అడ్వాంటేజ్ కానుంది.
















































