ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bigg Boss 10: 9th Week Voting & Danger Zone

బిగ్ బాస్10: ఈ వారం డేంజర్ జోన్ ఎవరంటే...

Bigg Boss 10: 9th Week Voting & Danger ZoneBigg Boss 10: 9th Week Voting & Danger Zone


బిగ్ బాస్ సీజన్ 10 లో ఎపుడు ఏం జరుగుతుందో, ఎప్పుడు ఎవరు ఎలిమినేట్ అవుతారో, ఆడియన్స్ ఓటింగ్ ను కూడా లెక్క చెయ్యకుండా హౌస్ మేట్స్ ఎలిమినేట్ అవుతున్నారో అనే విషయంలో ప్రేక్షకులను బిగ్ బాస్ యాజమాన్యం చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. ప్రతి నామినేషన్స్ లో ఆడియన్స్ ఓటింగ్ లో వెనుకబడిన వారు ఎలాగో సేవ్ అవుతున్నారు.

ఇమ్యూనిటీ అంటూ సేవ్ చేస్తున్నారు. దానితో ఆడియన్స్ ఓటింగ్ కి వాల్యూ లేదు. షాలిని ని, రోహిత్ ని బ్యాక్ టు బ్యాక్ హౌస్ మేట్స్ ఎలిమినేట్ చేసారు. వర్షిణి ఎన్నిసార్లు ఆడియన్స్ ఎలిమినేట్ చెయ్యాలన్నా ఆమె ఎలాగోకలా సేవ్ అవుతూనే ఉంది. కానీ ఈ వారం నామినేషన్స్ లో ఉన్న వర్షిణి ఎలిమినేట్ అయ్యేలానే కనిపిస్తుంది.

త్రిగుణ తప్ప ఈ వారం అందరూ నామినేషన్స్ లో ఉన్నారు. ముఖేష్ గౌడ, వర్షిణి, నీతూ మాస్టర్, రాంప్రసాద్, నరేష్, దేబ్ జానీ, అమన్, శివ్, రామకృష్ణ, సుధీర్, వంశి హౌస్ మొత్తం నామినేషన్స్ లో ఉంది. అందులో ఈ వారం ఓటింగ్ లో ముఖేష్ గౌడ నెంబర్ 1 ప్లేస్ లో ఉంటె..

డేంజర్ జోన్ లో ఈ వారం శివ్ కుమార్, నరేష్, రామ్ ప్రసాద్‌ల, యాంకర్ వర్షిణి ఉన్నారు. వీరిలో ఎవరు ఈ వారం ఎలిమినేట్ అవుతారో చూడాలి.

Bigg Boss Telugu 10