ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Aadarsha Kutumbam Needs a Second-Week Miracle?

దుకాణం సర్దేసిన ఆదర్శం

 Aadarsha Kutumbam Needs a Second-Week Miracle?Aadarsha Kutumbam Needs a Second-Week Miracle?


వెంకటేష్-త్రివిక్రమ్ కలయికలో మొదటిసారి తెరకెక్కిన ఆదర్శ కుటుంబం దసరా ముందు అక్టోబర్ 9 న విడుదలైతే అద్భుతంగా వర్కౌట్ అయ్యేది. కానీ జైలర్ 2 కోసం ఆపి ఆపి అక్టోబర్ 30 న ఆదర్శ కుటుంబం విడుదల చేసారు. ఈ చిత్రానికి మొదటి రోజే మిక్స్డ్ రెస్పాన్స్ రావడం షాకిచ్చింది.

సోషల్ మీడియాలో ఆదర్శ కుటుంబం ఆహా ఓహో అన్నా, ఆ కలెక్షన్స్ పోస్టర్ ఫేక్ వేసుకున్నా ఏదైనా ఆదర్శ కుటుంబానికి బాగానే నష్టాలొచ్చాయని ఇప్పుడు సోషల్ మీడియాలో పడుతున్న ట్వీట్లు చూసి చాలామంది ఆదర్శం మేకర్స్ ని ట్రోల్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు రామాయణ, సీన్, సమ్మర్ హాలిడేస్ ఎఫెక్ట్ ఆదర్శ కుటుంబం పై పడింది.

మొదటి వీకెండ్ తోనే ఆదర్శ కుటుంబం చిత్రం తేలిపోయింది. సోమవారం నుంచి ఆదర్శ కుటుంబం కలెక్షన్స్ డ్రాప్ అయ్యింది. మొదటి వీకెండ్ లో రూ.75 కోట్ల గ్రాస్ పోస్టర్ తో ట్రోల్ అయినా మేకర్స్ ఆతర్వాత అఫీషియల్ కలెక్షన్స్ పోస్టర్ వేయలేదు. ఇక ఇప్పుడు దివాళి రిలీజులతో ఈ వారంతో అంతో ఇంతో ఉన్న ఆదర్శ కుటుంబం దుకాణం సర్దేసింది. 

Aadarsha Kutumbam Faces a Tough Second Week