రామాయణ: సాయి పల్లవికి మైనస్
Ramayana: Sai Pallavi has faced relentless criticism for playing Sita
నిన్న గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన బాలీవుడ్ రామాయణ చిత్రానికి క్రిటిక్స్ మంచి రేటింగ్స్ ఇచ్చారు, సినిమా గొప్పగా ఉంది అంటూ అదిరిపోయే రివ్యూస్ ఇచ్చారు. రామాయణ చిత్రం చాలా బావుంది, రావణ్ పాత్ర చేసిన యశ్ అదిరిపోయే పెరఫార్మెన్స్ ఇచ్చారు, రణబీర్ కపూర్ ఓకే ఒకే, విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతం అంటూ విమర్శకుల సైతం పొగడ్తలు కురిపించారు.
అయితే బాలీవుడ్ రామాయణ చిత్రంలో సీత పాత్రకి సౌత్ హీరోయిన్ సాయి పల్లవి ని తీసుకున్నారు. ఇప్పుడు రామాయణ చిత్రానికి సీత పాత్రే మైనస్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. సీత పాత్రలో సాయి పల్లవి సూట్ కాలేదు, రన్బీర్ కపూర్-సాయి పల్లవి కాంబో సెట్ కాలేదు. అసలు సీత గా సాయి పల్లవిగా ఊహించలేకపోతున్నాం..
ఆమెను శ్యామ్ సింగరాయ్ లో చూసాం, చాలా బావుంది, కానీ సీత గా సాయి పల్లవి బాలేదు అంటూ నిర్మొహమాటంగా మాట్లాడుతున్నారు. రామాయణ చిత్రానికి సాయి పల్లవి మైనస్ అంటున్నారు. సాయి పల్లవి డెఫనెట్ గా మంచి నటి, కానీ సీత పాత్ర కు ఆమెను ఎంచుకోవడం మేకర్స్ తప్పిదం అంటూ నెటిజెన్స్ ట్వీట్లు చేస్తున్నారు.
మరి ఈ కామెంట్స్ అన్ని సాయి పల్లవి కి ఎఫెక్ట్ పడేలా ఉన్నాయి. సాయి పల్లవి నటించిన ఏ చిత్రానికి ఆమె కేరెక్టర్ పై ఈ స్థాయి విమర్శలైతే రాలేదు
















































