యంగ్ డాక్టర్ పై మలయాళ నటి దాడి
Malayalam actress attacks young doctor
మలయాళంలో ఇండస్ట్రీలో ఓ దారుణం చోటు చేసుకుంది. కేరళలో ఓ యంగ్ డాక్టర్ ను మలయాళ నటి ఫ్లాట్ కి పిలిపించి దాడి చేయించడం హాట్ టాపిక్ గా మారింది. మలయాళ నటి అతుల్య చంద్ర ఓ యువ డాక్టర్ ని తన పిన్నికి ఆరోగ్యం బాగాలేదు అని ప్లాట్ కి పిలిపించి గుండాలతో దాడి చేయించడంతో ఆమెపై కేసు నమోదు అయ్యింది.
అతుల్య చంద్ర తో ఆ యంగ్ డాక్టర్ కి ఇంతకుముందే పరిచయం ఉంది. ఆ పరిచయంతోనే ఆమె తన పిన్నికి బాలేదు అని చెప్పి అతనికి ఫోన్ చేసి ప్లాట్ కి పిలిపించి అతను రాగానే అతుల్య చంద్ర తో పాటుగా అక్కడే ఉన్న ఓ ముఠా దాడి చెయ్యడమే కాదు.. ఆ డాక్టర్ దగ్గర ఉన్న విలువైన వస్తువులు దొంగిలించారని.. దాడి నుంచి తప్పించుకున్న ఆ యువ డాక్టర్ పోలీస్ లకు కంప్లైంట్ చేసినట్లుగా సమాచారం.
యువ డాక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి నటి అతుల్య చంద్ర తో పాటుగా దాడికి పాల్పడిన ముగ్గురిని అరెస్ట్ చేశారు. మిగతా నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
















































