సూర్య సీన్ ఫస్ట్ రిపోర్ట్
Scene first report
ఈ ఏడాది రెండు హిట్ల తో క్రేజీగా మారిన కోలీవుడ్ హీరో సూర్య రేపు శుక్రవారం సీన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మలయాళ దర్శకుడు జితు మాధవన్ తెరకెక్కించిన సీన్ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. భారీ ప్రమోషన్స్ తో రేపు విడుదల కాబోతున్న సీన్ చిత్రం ఫస్ట్ రిపోర్ట్ ఏమిటో చూసేద్దాం..
సీన్ చిత్రం ఫస్టాఫ్ కాస్త నెమ్మదిగా సాగినా, మంచి ఇంటర్వెల్ బ్లాక్‌తో సినిమా ఊపందుకుంటుందని, సూర్య యాక్టింగ్ చాలా బావుంటుంది, సూర్య ప్రేమ్ రాజ్ కేరెక్టర్ చూసి ఆడియన్స్ డెఫనెట్ గా సర్ ప్రైజ్ అవుతారని.. సీన్ సెకండాఫ్, ఫస్ట్ హాఫ్ కన్నా మరింత బలంగా సూర్య ఇంకా నస్లీన్ ఇద్దరూ పెరఫార్మెన్స్ తో పోటీ పడ్డారని చెబుతున్నారు.
జితు మాధవన్ మార్క్ హ్యూమర్, అదిరిపోయే ట్విస్టులు, సూర్య పాత సినిమాల రిఫరెన్సులు సీన్ కు హైలెట్ గా నిలవనున్నాయి.. అని హీరోయిన్ నజ్రియా ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్.. సూర్య సీన్ తో సూపర్ హిట్ కొట్టడమే కాదు హ్యాట్రిక్ కొట్టడం గ్యారెంటీ అంటున్నారు. చూద్దాం ఫైనల్ గా సీన్ ఎలా ఉండబోతుందో అనేది.
















































