ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Tollywood Box Office: Dubbing vs Dubbing

టాలీవుడ్ బాక్సాఫీసు: డబ్బింగ్ vs డబ్బింగ్

Tollywood Box Office: Dubbing vs DubbingTollywood Box Office: Dubbing vs Dubbing


రేపు శుక్రవారం టాలీవుడ్ బాక్సాఫీసు దగ్గర డబ్బింగ్ vs డబ్బింగ్ అన్న చందాన పోటీ నెలకొంది. బాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో నితీష్ తివారి తెరకెక్కించిన రామాయణ రేపు  శుక్రవారమే విడుదల కాబోతుంది. రన్బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యాష్ రావణ్ గా నటించిన రామాయణపై మంచి అంచనాలున్నాయి. యుఎస్ ప్రీమియర్స్ కి మిక్స్డ్ రెస్పాన్స్ కనిపించినా.. బుకింగ్స్ లో రామాయణ జోరు కనిపిస్తుంది.

అదే శుక్రవారం కోలీవుడ్ నుంచి సూర్య సీన్ విడుదలకాబోతుంది. రెండు బిగ్ హిట్స్ తో జోరు మీదున్న సూర్య సీన్ తో గట్టిగా కొట్టాలని ఫిక్స్ అయ్యారు. నజ్రియా హీరోయిన్ గా నటించిన ఈచిత్రంలో మలయాళ హీరో నెస్లేన్ కీ రోల్ ప్లే చేసాడు. ఈ చిత్రం బుకింగ్స్ కూడా బావున్నాయి.

తెలుగులో కరుప్పు, విశ్వనాథ్ అండ్ సన్స్ తో మంచి హిట్ అందుకున్న సూర్య సీన్ తో సక్సెస్ సాధించి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. నయనతార మహాశక్తి ఈ వారమే విడుదల కాబోతుంది. ఇక ఈవారం టాలీవుడ్ బాక్సాఫీసు దగ్గర డబ్బింగ్ vs డబ్బింగ్ అన్న రేంజ్ లో పోటీ కనిపిస్తుంది. ఈ మద్యల్లో సమ్మర్ హాలిడేస్ అనే చిన్న ఇంట్రెస్టింగ్ చిత్రం కూడా విడుదల కాబోతుంది.  

Ramayana vs Scene