ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Mahesh Babu is stepping into the gaming world

గేమింగ్ రంగంలోకి సూపర్ స్టార్

 Mahesh Babu is stepping into the gaming worldMahesh Babu is stepping into the gaming world


సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలు మాత్రమే కాదు ఆయనకు బోలెడన్ని వ్యాపారాలు ఉన్నాయి. ఆయన సినిమాలు చేసుకుంటారు, భార్య నమ్రత వ్యాపారాలను అభివృద్ధి చేస్తుంది. సినిమాలు మాత్రమే కాదు మహేష్ పలు ప్రొడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా యాడ్స్ రూపంలోనే కోట్లు గడిస్తారు.

ప్రస్తుతం వారణాసి చిత్రంతో పాన్ ఇండియా మార్కెట్ ని టచ్ చెయ్యబోతున్న మహేష్ బాబు తాజాగా మరో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. అంతర్జాతీయ గేమింగ్ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తూ.. ముంబైకి చెందిన ప్రముఖ ఇంటరాక్టివ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ షార్ట్‌గన్‌ గేమ్స్ లో వ్యూహాత్మక పెట్టుబడిదారుగా మహేష్ భాగస్వామి అయ్యారు.

షార్ట్‌గన్‌ గేమ్స్ సంస్థ ఆధ్వర్యంలో రాబోతున్న భారీ యాక్షన్ అడ్వెంచర్ గేమ్‌ టేక్‌డౌన్: జెనెసిస్ గ్లోబల్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని రూపుదిద్దుకుంటోంది. మరి మహేష్ ఎంతో ఆలోచించి ఈ గేమింగ్ రంగంలోకి ఎంటర్ అయ్యారు.

Mahesh Babu