ఫెయిల్ అయిన ఆదర్శ కుటుంబం

Aadarsha Kutumbam Collection ReportAadarsha Kutumbam Collection Report


ఆదర్శకుటుంబం జస్ట్ వీకెండ్ సినిమా అని ప్రూవ్ చేసారు త్రివిక్రమ్ అండ్ వెంకటేష్. సోమవారం వచ్చేసరికి ఆదర్శ కుటుంబం కలెక్షన్స్ లో ఫుల్ డ్రాప్ కనిపించింది. కనీసం నైట్ షోస్ కూడా ఆక్యుపెన్సీ లేక వెలవెల బోయాయి అంటే నమ్మాలి. ఆదర్శ కుటుంబం చిత్రానికి మొదటి రోజు జస్ట్ యావరేజ్ టాక్ వచ్చింది.

ఆడియన్స్, క్రిటిక్స్ ఓవరాల్ గా మిక్స్డ్ రెస్పాన్స్ చూపించారు. దానితో సినిమా హిట్ అంటూ సక్సెస్ సెలెబ్రేషన్స్ చేసింది టీం. వీకెండ్ లో బాగానే కనిపించిన ప్రేక్షకులు సోమవారం పల్చబడ్డారు. దానితో ఆదర్శ కుటుంబం వసూళ్లలో భారీ డ్రాప్ కనిపించింది. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ లేకపోవడం, ఈ కాంబో పై ఉన్న అంచనాలను అందుకోలేకపోవడం మైనస్ అయ్యింది.

మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్ చిత్రాలకు డైలాగ్స్ ఇచ్చిన త్రివిక్రమ్.. వెంకీని డైరెక్ట్ చేస్తున్నారంటే ఆ సినిమాపై అంచనాలు మాములుగా ఉండవు. కానీ ఆ అంచనాలను తివిక్రమ్ నిలబెట్టుకోలేదు, అసలు పట్టించుకోలేదు. అందుకే ఆదర్శ కుటుంబం ఇలా ఉంది అంటూ ఆడియన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.

Aadarsha Kutumbam