ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bigg Boss Telugu 10: Mixed response to Rohit's elimination

బిగ్ బాస్: రోహిత్ ఎలిమినేషన్ పై మిక్స్డ్ రెస్పాన్స్

Bigg Boss Telugu 10: Mixed response to Rohit's eliminationBigg Boss Telugu 10: Mixed response to Rohit's elimination


బిగ్ బాస్ సీజన్ 10 లో కామనర్ గా బయట అభిమానులను సంపాదించుకున్న రోహిత్ నాయుడు పెద్ద ఇంపాక్ట్ సెట్ చేసాడు. అగ్నిపరీక్ష తోనే ఫ్యాన్ బేస్ ని స్ట్రాంగ్ గా ఏర్పాటు చేసుకున్న రోహిత్ బయట నా అభిమానులు చూసుకుంటారు అనుకున్నాడు. అతను అనుకున్నది నిజమే. రోహిత్ హౌస్ లో టాస్క్ పెరఫార్మ్ చెయ్యకపోయినా, వల్గర్ వాగుడు వాగినా ఆయన ఫ్యాన్స్ నామినేషన్స్ లోకి రోహిత్ వచ్చాడంటే చాలు అతన్ని టాప్ పొజిషన్ లో నిలబెట్టేవారు.

టాస్క్ లు మానేసి షాలిని తోనే టైమ్ స్పెండ్ చేస్తూ త్రిగుణ డామినేషన్ కు అడ్డుకట్ట వేస్తూ బిగ్ బాస్ హౌస్ లో కనిపించిన రోహిత్ నాయుడు కు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో, అంతకు మించి నెగిటివిటి కూడా ఉంది ఇక ఈ వారం డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా ముందుగా ఝాన్సీ ఎలిమినేట్ కాగా హౌస్ మేట్స్ ఓట్స్ తో రోహిత్ ఎలిమినేట్ అవడం అందరికి షాకిచ్చింది.

అయితే రోహిత్ ఎలిమినేషన్ పై సోషల్ మీడియాలో మిక్స్డ్ రెస్పాన్స్ కనిపిస్తుంది. ఆయన అభిమానులు రోహిత్ ఎలిమినేషన్ బిగ్ బాస్ యాజమాన్యం తప్పిదం, ఇది బ్లాక్ డే, స్టాండ్ ఫర్ రోహిత్ అంటూ స్పందిస్తుంటే... ఆయన హేటర్స్ రోహిత్ హౌస్ లో ఉండి ఉపయోగమేమిటి, అతను ఎప్పుడో ఎలిమినేట్ అవ్వాల్సింది అని అభిప్రాయపడుతున్నారు.

మరోపక్క బిగ్ బాస్ రివ్యూవర్స్ మాత్రం రోహిత్ ఎలిమినేషన్ అన్యాయం, అతనికి భీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, బిగ్ బాస్ కప్ రేస్ లో త్రిగుణ, రోహిత్ ఉన్నారు. రోహిత్ ని ఎలిమినేట్ చేస్తే త్రిగుణ తప్పులు ఎవరు వేలెత్తిచూపుతారు. అసలు రోహిత్ లేకపోతే బిగ్ బాస్ ఎవరు చూస్తారంటూ స్పందిస్తున్నారు.

Rohit Eliminated From Bigg Boss