ఆదర్శ కుటుంబం ఓవర్సీస్ టాక్
Aadarsha Kutumbam Overseas Talk
విక్టరీ వెంకటేష్-త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆదర్శ కుటుంబం డోర్ నెంబర్ 47. ఈ చిత్రం అనేకసార్లు రిలీజ్ డేట్ మార్చుకుంటూ ఫైనల్ గా ఈరోజు అక్టోబర్ 30 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లిమిటెడ్ ప్రమోషన్స్ తో ఆదర్శ కుటుంబం పెరఫార్మెన్స్ ఎలా ఉంటుందో, గురూజీ కామెడీ పంచ్ లకి, వెంకీ టైమింగ్ సెట్ అయ్యిందో, లేదో అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కనిపించింది.
ఆదర్శ కుటుంబం ఓవర్సీస్ షోస్ పూర్తి కావడంతో అక్కడి ఆడియన్స్ సోషల్ మీడియా వేదికగా ఈ చిత్రం పై స్పందిస్తున్నారు. ఆదర్శ కుటుంబం ఓవర్సీస్ టాక్ లోకి వెళితే.. సినిమా స్టార్టింగ్ స్లోగా ఉన్నా, ఫస్ట్ హాఫ్ మొత్తం వెంకీ కామెడీ టైమింగ్ తో అదరగొట్టేసాడు, ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోయింది. వెంకటేష్ ఎనెర్జీ, వన్ లైనెర్స్ సూపర్బ్ అంటూ కొంతమంది ఆడియన్స్ స్పందిస్తున్నారు.
ప్రీ ఇంటర్వెల్ దగ్గర నుంచి సినిమా ఫ్లో అదిరిపోయింది, వెంకీ యాక్టింగ్, త్రివిక్రమ్ మేకింగ్, థమన్ BGM సినిమాకి స్పెషల్ అట్రాక్షన్స్, ఫస్ట్ హాఫ్ డీసెంట్ అని కొంతమంది అంటే.. ఫస్ట్ హాఫ్ ఎదో అలా అలా సాగిపోతుంది అని కొంతమంది తమ ఒపీనియన్స్ ని షేర్ చేస్తున్నారు.
లాజిక్ లేదు మ్యాజిక్ ఉంది.. వెంకీ-శ్రీనిధి పెయిర్ బావుంది, ఫ్యామిలీ ఎమోషన్స్, ఫ్యామిలీ సీన్స్, విలన్ గ్యాంగ్ ఇంట్రో, గురూజీ రైటింగ్, థమన్ BGM అన్ని అంటే అన్ని అదిరిపోయాయి, ఆదర్శ కుటుంబం సూపర్ హిట్ అంటూ వెంకీ అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. మరి ఆదర్శ కుటుంబం ఫైనల్ టాక్ ఏమిటో అనేది పూర్తి సమీక్షలో మరికాసేపట్లో..
















































