BB10: ముఖేష్ బిహేవియర్ పై ఆడియన్స్ ఫైర్
Bigg Boss Telugu 10 : Mukesh Gowda Vulgar Behaviour And Personal Attacks
బిగ్ బాస్ సీజన్ 10 లోకి సీరియల్ నటుడు, గుప్పెడంత మనసు ఫేమ్ ముఖేష్ గౌడ్ అడుగుపెట్టినప్పుడు ఇతను విన్నర్ మెటీరియల్ లా ఉన్నాడు అనుకున్నారు బిగ్ బాస్ ప్రేక్షకులు. గుప్పెడంత మనసుతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు ముఖేష్. హౌస్ లో కూడా టాస్క్ ల్లో పవర్ ఫుల్ గా కనిపించే ముఖేష్ మాట తీరు లో చాల డల్ మోడ్ లో ఉంటాడు.
అతనికి త్రిగుణ, రోహిత్ లా టాకింగ్ పవర్ లేదు. కానీ కామెండింగ్ చేయాలనుకుంటాడు. హౌస్ లో కెప్టెన్ అయ్యాక ముఖేష్ ఆట తీరుని అతని యాటిట్యూడ్ ని అపూర్వ ఎండగట్టింది. ఈ వారం వీకెండ్ ఎపిసోడ్ లోను హోస్ట్ నాగార్జున వచ్చి ముఖేష్ జెంటిల్మెన్ అనుకున్నా, కానీ నువ్ కూడా త్రిగుణ, రోహిత్ లను చూసుకుని మాట తూలుతున్నావ్ అంటూ క్లాస్ పీకారు.
ఇక ఇప్పుడు ఐదుగురు గొట్స్ లో ముఖేష్, దేబ్జానీ, త్రిగుణ, అమన్, నీతూ మాస్టర్ ఉంటె ఈ ఐదుగురుని కెప్టెన్సీ పవర్ ని యూస్ చెయ్యమని బిగ్ బాస్ చెప్పినప్పటినుంచి ముఖేష్ ఒక్కడే హౌస్ మొత్తం లీడ్ చేస్తున్నాడు. దేబ్జానీ, నీతూ, త్రిగుణ ఇలా ఎవ్వరిని మాట్లాడనివ్వడం లేదు.
రోహిత్ లా ముఖేష్ బిహేవ్ చేస్తున్నాడనే కామెంట్స్, పక్కకెళ్లి ఆడుకో, నువ్ ఫ్రేమ్ లో లేవు అంటూ శివ్, దేబ్జానీ లాంటి వాళ్ళను ముఖేష్ కించపరచడం అన్ని ముఖేష్ బిహేవియర్ పై ఆడియన్స్ ఫైర్ అవడమే కాదు.. ముఖేష్ గ్రాఫ్ కూడా తగ్గిపోయేలా చేస్తుంది.
















































