షాప్ ఓపెనింగా లేదంటే పొలిటికల్ ర్యాలీనా ?
Trisha Roadshow Raises Political Concerns
సినీ తారలు ఏదైనా షోరూం ఓపెనింగ్ కి వస్తున్నారంటే అభిమానులు తమకిష్టమైన సెలెబ్రిటీని చూసేందుకు వేలకొలది గుమ్మికూడతారు. హీరోయిన్స్ అయితే బట్టల షాప్ ఓపెన్ చేసినా, మొబైల్ షోరూం ఓపెన్ చేసినా, లేదంటే నగల దుకాణానికి రిబ్బన్ కటింగ్ చేసినా అక్కడ అభిమానులు వేలాదిగా పోగవుతారు. సినీతారలు కూడా షోరూం ఎదుట నించుని చిరునవ్వుతో అభిమానులకు అభివాదం చేస్తారు.
కానీ నటి త్రిష కోయంబత్తూరు లో ఓ మొబైల్ షాప్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా రావాల్సి ఉండగా ఆమె భారీ ర్యాలీతో, అలాగే కార్ సన్ రూప్ పై ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తూ ఆ ఓపెనింగ్ కి రావడం ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. విజయ్ రాజకీయాల్లోకి వచ్చి ఆయన సీఎం అయ్యాక ఆయన వెన్నంటే అధికారిక కార్యక్రమాల్లో కనిపిస్తున్న త్రిష ఏ క్షణమైనా విజయ్ టీవీకే పార్టీలో చేరి మినిస్టర్ పదవి పొందేందుకు అవకాశం ఉంది అంటూ ప్రచారం జరుగుతుంది.
ఇప్పుడు త్రిష ఓ చిన్న మొబైల్ షోరూం ఓపెనింగ్ కి వస్తూ.. ఒక పెద్ద పొలిటికల్ లీడర్ లా ఫోజు కొడుతూ కారు సన్‌రూఫ్ నుంచి బయటకు వచ్చి.. వేలాదిగా తరలివచ్చిన ప్రజలకు చిరునవ్వుతో అభివాదం చేస్తూ హంగామా చేసింది. అది చూసి అటు పొలిటికల్ వర్గాలు, ఇటు తమిళనాడు ప్రజలు షాకవుతున్నారు.
త్రిష విజయ్ లా రాజకీయాల్లోకి రావడానికే ఇదంతా చేస్తుంది. ఆమె విజయ్ పార్టీలో చేరి ఆ పార్టీలో కీలక పాత్ర పోషించడం ఖాయం అంటూ మాట్లాడుకుంటున్నారు.
















































