ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bigg Boss 10: Rohit's fans are celebrating

బిగ్ బాస్ 10: పండగ చేసుకుంటున్న రోహిత్ ఫ్యాన్స్

Bigg Boss 10: Rohit's fans are celebratingBigg Boss 10: Rohit's fans are celebrating


అగ్నిపరీక్ష లో అందరిమనసులు గెలిచి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో బిగ్ బాస్ సీజన్ 10 హౌస్ లోకి అడుగుపేటి మొదటి రెండు వారాలు ఆట తో అలాగే మాట తీరుతో అందరికి దగ్గరైన రోహిత్ నాయుడు మూడో వారం నుండి ఆటలో కనిపించడమే మానేసాడు, త్రిగుణ తో గొడవ పడుతూ ఇచ్చిన పని చెయ్యకుండా వీకెండ్ ఎపిసోడ్ లో హోస్ట్ తో తిట్లు తినడమే పనిగా పెట్టుకున్నాడు.

కారణం రోహిత్ షాలిని తో చేసే ఫ్రెండ్ షిప్. ఆమెను డిపెండ్ చేసే ప్రాసెస్ లో ఆట లో పట్టు కోల్పోయి మాటలో సహనం కోల్పోయి బయట అతనిపై నెగిటివిటి పెంచుకున్నాడు. వైల్డ్ కార్డులు వచ్చి షాలిని వల్లే నీ ఆట ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పినా రోహిత్ తీరు మారలేదు. షాలిని, షాలిని.. ముద్దులు, హగ్గులు అలాగే ఆమె అలక తీర్చేందుకు, గుసగుసలతో బిగ్ బాస్ వార్నింగ్ లతో కాలం గడిపేసాడు.

కానీ ఇప్పుడు రోహిత్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. కారణం షాలిని ఎలిమినేట్ అయ్యి హౌస్ ని వదిలేసింది, హాఫ్ సీజన్ రోహిత్ ఆడలేదు, కారణం షాలిని నే, ఇప్పుడు ఆమె ఎలిమినేట్ అయ్యింది, మా వాడిని ఆటలో ఆపేవాళ్లు లేరు, ఇక రోహిత్ దే కప్పు అంటూ వారు సంబరాలు చేసుకుంటున్నారు. రోహిత్ కి పట్టిన శని వదిలింది అంటూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
 

Bigg Boss Telugu 10: Shalini Eliminated! Rohit Fans Celebrate Like a Festival