ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Fauzi is postponed again, it will lose OTT deal

బిగ్ డీల్ మిస్ చేసుకున్న ప్రభాస్ ఫౌజీ

Fauzi is postponed again, it will lose OTT dealFauzi is postponed again, it will lose OTT deal


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సీతారామం ఫేమ్ హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఫౌజీ చిత్రం పై నిన్నటివరకు భీభత్సమైన అంచనాలున్నాయి. కానీ ఇప్పుడు ఫౌజీపై ఆ రేంజ్ అంచనాలు కనిపించడం లేదు. అది ఫౌజీ గ్లింప్స్ చూసాక తగ్గినవి కాదు, పదే పదే రిలీజ్ డేట్స్ మార్చుకున్న ఫౌజీ ని చూసి చాలామందిలో అనుమానాలు మొదలయ్యాయి.

ఇప్పటికే ఫౌజీ రీ షూట్స్ తీసుకుంటుంది అని, హీరో గారికి ఫౌజీ అవుట్ ఫుట్ నచ్చలేదు, అందుకే సినిమాని వాయిదా వేశారు, డిసెంబర్ నుంచి మార్చ్ కి పోస్ట్ పోన్ చేశారనే వార్తల నేపథ్యంలో ఫౌజీ చిత్రం ఇప్పటూ ఓటీటీ డీల్ లో కొంత లాస్ అయ్యింది.. షూటింగ్ డిలే, అలాగే రిలీజ్ డేట్ మార్చడం వల్లే నిర్మాతలు ఓటీటీ డీల్ లో కొంత నష్టపోయారనే టాక్ వినిపిస్తుంది.

ఫౌజీ రిలీజ్ వాయిదా తో ఫౌజీ డిజిటల్ హక్కులు భారీ ధరకు చేజిక్కించుకున్న నెట్ ఫ్లిక్స్ దాదాపుగా 20 శాతం కోట పెట్టిందట. నెట్ ఫ్లిక్స్  ఫౌజీ కోసం ముందు అనుకున్నట్టు అంత ధర చెల్లించమని నిర్మాతలకు షాకిచ్చింది. మరి ఫౌజీ చిత్ర గ్లింప్స్ విషయంలోనూ సోషల్ మీడియా ట్రోల్స్ కూడా సినిమాపై ప్రస్తుతం ఉన్న హైప్ పై కూడా ఎఫెక్ట్ పడే సూచనలు గట్టిగానే కనిపిస్తున్నాయి.

మరి ఈ విషయంలో ప్రభాస్ ఏమనుకుంటున్నారో, దర్శకుడు హను ఈ ట్రోల్స్ ని ఎలా తీసుకుంటారో అనేది కాస్త వేచి చూడాల్సిందే.  

Fauzi Movie new release date