BB10: అక్కడ తప్పించుకున్నా-ఇక్కడ దొరికిపోయింది

Bigg Boss 10: Shalini EliminatedBigg Boss 10: Shalini Eliminated


గత వారం ఆడియన్స్ ఓటింగ్ తో ఎలిమినేట్ అయ్యి స్టేజ్ పైకి వచ్చి నాగార్జున పక్కనే నుంచుని బర్త్ డే విషెస్ చెప్పించుకున్న అగ్నిపరీక్ష షాలిని ఆతర్వాత సీక్రెట్ రూమ్ కి వెళ్లొచ్చి ఆట మారుస్తా, నేనేమిటో చూపిస్తా అంటూ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఆమె మరోసారి హౌస్ మేట్స్ చేతిలో ఓటమిని చవిచూసింది.

నన్ను అందరూ ఎలిమినేట్ అయ్యి మళ్ళి వచ్చావ్ అంటున్నారు తీసుకోలేకపోతున్నాను అని అన్న షాలిని కి నాగార్జున బంపర్ అఫర్ ఇచ్చారు. డోర్స్ ఓపెన్ షాలిని వెళ్ళాలి అనుకుంటే వెళ్ళు అని. కానీ రోహిత్ కన్విన్స్ చెయ్యగానే నేనేమిటో చూపిస్తా, నన్ను అన్న వాళ్లకు నా ఆట తో సమాధానమిస్తా అన్న 24 గంటల్లోనే హౌస్ మేట్స్ సపోర్ట్ లేక షాలిని మళ్లి ఎలిమినేట్ అయ్యింది.

రెడ్ జోన్ లో ఉన్న రోహిత్, షాలిని, రామకృష్ణలలో ఎవరో ఒకరిని హౌస్ నుంచి ఎగ్జిట్ చెయ్యమని గ్రీన్ జోన్ లో ఉన్న అమన్, దేబ్జానీ, నీతూ, త్రిగుణ, ముఖేష్ లకు నాగార్జున సూచించగా.. షాలిని కి నీతూ మాస్టర్, దేబ్జానీ, త్రిగుణ లు ఓటెయ్యగా, అమన్, ముఖేష్ లు రామకృష్ణ ఎగ్జిట్ అవ్వాలనుకున్నారు.

దానితో గత వారం ఆడియన్స్ ఓటింగ్ తో ఎలిమినేట్ అయ్యి మళ్లీ హౌస్ లోకి వచ్చిన షాలిని ఈ వారం హౌస్ మేట్స్ ఓటింగ్ తో ఎలిమినేట్ అయ్యింది.

Shalini Eliminated From Bigg Boss house