BB10: డబుల్ ఎలిమినేషన్ లో వెళ్ళింది ఎవరంటే..!
Bigg Boss 10: Shalini Eliminated
బిగ్ బాస్ సీజన్ 10 లో మాత్రమే కాదు.. ఇప్పటివరకు బిగ్ బాస్ చరిత్రలోనే ఎవరు తీసుకొని బ్లాక్ బ్యాడ్జ్ ని హోస్ట్ నాగార్జున రోహిత్ కి ఇచ్చారు. ఈ సీజన్ లో ఎవరికీ రాని జైలు పనిష్మెంట్ త్రిగుణ కి వచ్చింది. శనివారం ఎపిసోడ్ లో నాగార్జున ఈ వారం సహనం కోల్పోయి తప్పు చేసిన త్రిగుణ, రోహిత్ లకు మాత్రమే కాదు.. సీక్రెట్ రూమ్ కి వెళ్లొచ్చి ఆట తీరు మార్చుకొని షాలిని కి కూడా గట్టిగా క్లాస్ పీకారు.
షాలిని రావడం ఇష్టం లేదు అని రామ్ ప్రసాద్ చెప్పడంతో.. షాలిని నేను రావడం ఎవరికి నచ్చలేదు అంటూ ఏడ్చేసింది. ఎందుకమ్మా షాలిని ఏడుస్తున్నావ్ అని నాగార్జున అడిగితె నన్ను అందరూ నీకు మరో ఛాన్స్ వచ్చింది, ఎలిమినేట్ అయ్యి మళ్లీ వచ్చావ్ అంటున్నారు అంది, అదే నిజం కదా.. సరే బయటికి వెళ్లి అంతా చూసి వచ్చావ్.
నీ ఆట మారిందా అంటే లేదు, అదే విషయం నాగ్ హౌస్ మేట్స్ ని అడిగారు, శాలినిలో ఏమైనా మార్పు వచ్చిందా అంటే లేదు అని హౌస్ మొత్తం చెప్పింది. నేను వెళ్ళిపోతా అంది షాలిని, వెళ్ళమని నాగ్ గేట్స్ ఓపెన్ చేసారు. తర్వాత రోహిత్ చెప్పాడని ఆగిపోయింది, కానీ హౌస్ ఓటింగ్స్ తో షాలిని ఈరోజు ఆదివారం ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తుంది.
ఆడియన్స్ ఓట్స్ తో దక్షి గుత్తికొండ డేంజర్ జోన్ లోకి వచ్చి ఈవారం ఎలిమినేట్ అయితే షాలిని హౌస్ మేట్స్ ఓట్స్ తో ఈ వారం డబుల్ ఎలిమినేషన్స్ లో భాగంగా ఎలిమినేట్ అయ్యింది, సో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగినట్లుగా తెలుస్తుంది.
















































