బెటర్ వెర్షన్ తో ఓటీటీ లోకి ప్యారడైజ్
The Paradise OTT release released
నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ది ప్యారడైజ్ చిత్రం సెప్టెంబర్ 24 న థియేటర్స్ లో విడుదలైంది. ఒక రోజు ముందే ప్రీమియర్స్ వెయ్యగా ప్రీమియర్స్ తో సినిమాకి విపరీతమైన నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. సినిమాలోని చాలా సీన్స్ ని సినీవిమర్శకులు చీల్చి చెండాడారు.
మరోపక్క సోషల్ మీడియాలో ప్యారడైజ్ పై ట్రోల్స్ సినిమాని చాలా వరకు కిల్ చేసాయి. ఇపుడు ఈ చిత్రం ఓటీటీ లోకి వచ్చింది. ఈరోజు అక్టోబర్ 22 నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ లోకి వచ్చింది. అయితే ప్యారడైజ్ ఓటీటీ వెర్షన్ లో చాలా మార్పులు చేశారు. ప్యారడైజ్ లో ఎక్కువగా ట్రోల్ అయిన ధూమావతి ఫైట్ ఎపిసోడ్‌ను ఎడిట్ చేసారు.
అలాగే మదర్ డాన్స్ మొత్తం లేపేశారు, దాదాపుగా 24 మినిట్స్ ట్రిమ్ చేసారని, ఇక సినిమాలో చాలా చోట్ల గ్రాఫిక్స్ ని కూడా బెటర్ గా చేశారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సో థియేటర్స్ లో విమర్శల పాలైన ప్యారడైజ్ సీన్స్ లోని చాలా వాటిని ఓటీటీ లో బెటర్ చేసి స్ట్రీమింగ్ లోకి తెచ్చారు.
















































