వారణాసి స్టోరీ రివీల్ చేసిన రాజమౌళి

Rajamouli reveals the Varanasi storyRajamouli reveals the Varanasi story


వారణాసి చిత్రంతో సూపర్ స్టార్ మహేష్ ని డైరెక్ట్ చేస్తున్న ఎస్ ఎస్ రాజమౌళి సందర్భం వచ్చినప్పుడల్లా సినిమాపై విపరీతమైన హై ఇస్తున్నారు.. ఓ పది రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉన్న వారణాసికి ఎప్పుడో పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటుగా సినిమా ప్రమోషన్స్ ను ఇంటర్నేషనల్ స్థాయిలో మొదలు పెట్టేసారు రాజమౌళి.

ఎప్పటికప్పుడు వారణాసి పై రాజమౌళి ఇస్తున్న అప్ డేట్స్ సినిమా స్థాయిని తెలియజేస్తున్నాయి. రీసెంట్ గా రాజమౌళి ఇంటర్నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. వారణాసి మూవీ సైన్స్‌ ఫిక్షన్‌లా అనిపించినా.. ఇదొక మైథాలజీ అంశాలతో కూడిన ఫాంటసీ ఫిల్మ్. తండ్రీ కొడుకుల అనుబంధంతో పాటు హీరో హీరోయిన్ల మధ్య బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంటుంది.. అంటూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

అంతేకాకుండా మహేష్ బాబు కేపబులిటీ ఏమిటో నాకు తెలుసు. నేను ఆయనతో వర్క్ చేయడం మొదలుపెట్టాక, మహేష్ నా అంచనాలకు మించి నటించారు. నేను ఊహించినదాని కంటే రెండు వందల శాతం పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఆయన. మహేష్ తన పాత్రలో ఒదిగిపోయి, దానికి ప్రాణం పోశారు. అది చూసి నేను షాకయ్యను అంటూ మహేష్ పై రాజమౌళి ప్రసంశలు కురిపించారు. 

Varanasi: SS Rajamouli reveals the biggest challenge