దేవి పదుకొనే ని పరిచయం చేసిన దీపికా-రణవీర్
Deepika, Ranveer Singh reveal second daughter’s name
బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్వీర్ సింగ్ ఇంకా దీపికా పదుకొనే లు దసరా విజయదశమి సందర్భంగా తమ చిన్న కుమార్తె పేరుని రివీల్ చేసారు. అది కూడా ఓ బ్యూటిఫుల్ ఫ్యామిలీ పిక్ తో. నటి దీపికా పదుకొనే రీసెంట్ గానే రెండో పాప కు జన్మనిచ్చింది. రెండేళ్ల ముందే ఈ జంటకు ఓ పాప ఉంది. ఆ పాప పేరు దువా.
ఈరోజు దసరా ఫెస్టివల్స్ సందర్భంగా రణ్వీర్ సింగ్ ఇంకా దీపికా పదుకొనే లు తమ పెద్ద కూతురు దువా, అలాగే చిన్న కూతురు తో కలిసి ఫెస్టివల్ లుక్ లో ఉన్న అందమైన పిక్ ని షేర్ చేస్తూ తమ చిన్న కుమార్తె కు దేవి పదుకొనే సింగ్ పేరు ని పెట్టినట్టుగా రివీల్ చేసారు. ప్రస్తుతం రణ్వీర్ ఇంకా దీపికా ల ఫ్యామిలీ పిక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
ఇక రణ్వీర్ సింగ్ అలాగే దీపికా లు కెరీర్ లో పీక్స్ లో ఉన్నారు. అటు దీపికా ఇటు రణ్వీర్ సింగ్ లు క్రేజీ ప్రాజెక్ట్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు.
















































