పెళ్లి పీటలెక్కబోతున్న యువ హీరో !
Teja Sajja to enter wedlock
చాలామంది హీరోలు వయసు దాటిపోయాక పెళ్లిళ్లు చేసుకుని లైఫ్ లో సెటిల్ అయ్యారు. కానీ కొంతమంది హీరోలు ఏ వయసులో ముచ్చట ఆ వయసులో తీరాలనే సామెతను ఫాలో అవుతారు. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరో స్థాయికి చేరి హనుమాన్, మిరాయ్ చిత్రాలతో పాన్ ఇండియా ప్రేక్షకులను కదిలించిన యువ హీరో తేజ సజ్జ పెళ్లి పీటలెక్కేందుకు రెడీ అయ్యాడు.
ప్రస్తుతం తేజ సజ్జ చేతిలో క్రేజీ ప్రాజెక్ట్స్ ఉండడమే కాదు.. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ కోసం ది ట్రేటర్స్ అనే రియాలిటీ షోకి హోస్ట్ గా చేస్తున్నాడు. ఇప్పుడు ఈ హీరో పెళ్లి చేసుకోబోతున్నాడు. అది కూడా సినిమా ఇండస్ట్రీకి పరిచయం లేని రంగం నుంచి వచ్చిన అమ్మాయిని తేజ సజ్జ పెళ్లాడబోతున్నాడు.
సాఫ్ట్ వేర్ రంగానికి చెందిన అమ్మాయితో తేజ సజ్జ పెళ్లి జరగబోతుంది. వచ్చే నెల నవంబర్ లో ఎంగేజ్మెంట్ చేసుకుని ఆతర్వాత పెళ్లి చేసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. తేజ సజ్జ చేసుకోబోయే అమ్మాయి వివరాలు తెలియాల్సి ఉంది.
















































