జైలర్ 2: రూ.1000 కోట్ల కల తీరేనా?
Jailer 2 box office prediction
కోలీవుడ్ ఇండస్ట్రీ రూ.1000 కోట్ల బ్లాక్ బస్టర్ కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తుంది. కోలీవుడ్ స్టార్స్ ఎవరో ఒకరు రూ.1000 కోట్ల కల తీరుస్తారని తమిళ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ 2 తో కోలీవుడ్ వాళ్ళు కన్న ఆ రూ.1000 కోట్ల కల తీరుతుంది అని చాలామంది ఆశించారు.
ప్రస్తుతం అయితే జైలర్ 2 కలెక్షన్ ఫ్లో చూస్తే కోలీవుడ్ కి జైలర్ 2 రూ.1000 కోట్ల బ్లాక్ బస్టర్ ని అందించడం పక్కాగానే కనిపిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా జైలర్ 2 రోజుకి రూ.100 కోట్ల గ్రాస్ తీసుకొస్తుంది. అయితే ఈ కలెక్షన్స్ వీకెండ్ వరకేనా, లేదంటే జైలర్ 2 సెకండ్ వీక్ లోను ఇదే హవా కొనసాగిస్తుందా అనే సందేహాలు ఉన్నాయి.
కారణం జైలర్ 2 ఫస్ట్ హాఫ్ ఎక్సట్రార్డినరీ, సెకండ్ హార్డ్ వీక్ అనే కామెంట్స్, అనిరుద్ మ్యూజిక్ అదిరిపోయింది అనే టాక్ ఉంది, మరి సెకండ్ హాఫ్ లో కూడా కామెడీ ఇంకాస్త వర్కౌట్ అయితే గనక జైలర్ 2 చిత్రం రూ.1000 కోట్ల క్లబ్బుకి ఈజీగా దగ్గరయ్యేది. కానీ ఇప్పుడు ఈ వీకెండ్, అలాగే దసరా హాలిడేస్ ముగిసాక జైలర్ 2 కలెక్షన్స్ ఎలా ఉంటాయనే సందేహాలు మొదలయ్యాయి.
దానితో కోలీవుడ్ రూ.1000 కోట్ల కల జైలర్ 2 తీరుస్తుందా, లేదంటే వారి కల కలగానే మిగిలిపోతుందా అనేది చూడాలి.















































