ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> The Paradise OTT streaming date locked

ది ప్యారడైజ్ ఓటీటీ కొచ్చేస్తుంది

The Paradise OTT streaming date lockedThe Paradise OTT streaming date locked


నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ది ప్యారడైజ్ మూవీ భారీ అంచనాల నడుమ గత నెల 24 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్యారడైజ్ ట్రైలర్ లేకపోయినా.. ప్రమోషన్స్ తో సినిమాపై హైప్ క్రియేట్ చెయ్యడంతో భారీ ఓపెనింగ్స్ తెచ్చుకుంది. అయితే సినిమా విడుదలయ్యాక సినిమాకి నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అవడం..

సోషల్ మీడియాలో ప్యారడైజ్ పై ట్రోల్స్ అన్ని కలెక్షన్స్ పై ఎఫెక్ట్ చూపించాయి. హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ తర్వాత సినిమాని ఎంతగా ప్రమోట్ చేసినా వర్కౌట్ అవలేదు. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ కి రెడీ అయ్యింది. అది కూడా ఈ వారమే ప్యారడైజ్ ఓటీటీ ఆడియన్స్ ముందుకు రాబోతుంది.

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ప్యారడైజ్ డిజిటల్ హక్కులను ఫ్యాన్సీ డీల్ తో సొంతం చేసుకుంది. ఈనెల 22 నుంచి ప్యారడైజ్ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేస్తున్నట్టుగా నెట్ ఫ్లిక్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ మరియు మలయాళ భాషల్లో ప్యారడైజ్ విడుదల కానుంది.

The Paradise Locks OTT Release