ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Rakhi Sawant Faces Non-Bailable Warrant

న‌టికి నాన్ బెయిల్ వారెంట్!

Rakhi Sawant Faces Non-Bailable WarrantRakhi Sawant Faces Non-Bailable Warrant

 

బాలీవుడ్ వివాదాస్పద నటి రాఖీ సావంత్ మరోసారి  చిక్కుల్లో పడ్డారు. గతంలో ఆమె హోస్ట్ చేసిన సంచలనాత్మక రియాలిటీ షో `రాఖీ కా ఇన్సాఫ్` వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసులో విచారణకు గైర్హాజరు కావడంతో న్యాయస్థానం ఆమెకు వ్యతిరేకంగా నాన్-బెయిలబుల్ వారెంట్  జారీ చేసింది. దీంతో ఇండస్ట్రీలో ఈ వార్త  హాట్ టాపిక్‌గా మారింది.

ఈ వివాదం మూలాలు చాలా ఏళ్ల కిందటి రియాలిటీ షోకు వెళతాయి. రాఖీ సావంత్  హోస్ట్‌గా వ్యవహరించిన `రాఖీ కా ఇన్సాఫ్` షో అప్పట్లో భారీ టీవీ రేటింగ్స్‌తో పాటు తీవ్ర విమర్శలను కూడా మూటగట్టుకుంది. షోలో పాల్గొన్న ఒక కంటెస్టెంట్ ..వ్యక్తి చేసిన వ్యాఖ్యలు... ఆ షోలో చోటుచేసుకున్న పరిణామాలు పెద్ద ఎత్తున దుమారం రేపాయి. షో వేదికగా జరిగిన కొన్ని సంఘటనలు  వ్యక్తి మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని.. పరువు నష్టం కలిగించేలా ఉన్నాయని ఆరోపిస్తూ కోర్టులో పిటిషన్ దాఖలైంది.

ఈ కేసుకు సంబంధించి గత పదేళ్లకు పైగా కోర్టులో విచారణ జరుగుతూనే ఉంది. అయితే లీగల్ ప్రొసీడింగ్స్‌కు రాఖీ సావంత్ సరైన సమయంలో హాజరుకాకపోవడం.. కోర్టు ఇచ్చిన సమన్లను పదే పదే విస్మరించడం జరిగిందని న్యాయస్థానం భావించింది. గత కొన్ని వాయిదాల నుంచి ఆమె కోర్టు విచారణకు హాజరుకాకపోవడంతో జడ్జి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
 

Rakhi Sawant gets non-bailable warrant in 2010 suicide case