డొరొతి ఓటీటీ డేట్ లాక్
Dorothy OTT release date locked
కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన డోరతి కోలీవుడ్ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తమిళనాట విజయాన్ని అందుకున్న ఈ చిత్రం తెలుగులోనూ విడుదలైంది. సామాజిక అంశాలు, డ్రామా నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాని సినీవిమర్శకులు సైతం పొగిడేశారు.
థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న డోరతి చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ కి సమయం ఆసన్నమైంది. ఈ చిత్రానికి సంబందించిన డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ చేజిక్కించుకుంది. ఇప్పుడు డోరతి చిత్రాన్ని స్ట్రీమింగ్ చేసేందుకు నెట్ ఫ్లిక్స్ సిద్ధమైంది.
అక్టోబర్ 23 నుంచి నెట్ఫ్లిక్స్లో డోరతి సినిమా స్ట్రీమింగ్ కానుంది అని అఫీషియల్ గా ప్రకటించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ నుంచి ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
















































