జైలర్ 2: ఆ విషయంలో ఆడియన్స్ డిజప్పాయింట్మెంట్
Jailer 2 Social Media Talk
జైలర్ 2 బ్లాక్ బస్టర్ టాక్ తో.. అద్భుతమైన కలెక్షన్స్ తో దూసుకుపోతుంటే.. ఆ చిత్రానికి మెయిన్ మైనస్ అంటున్నారేమిటి అనుకుంటున్నారా... జైలర్ పార్ట్ 1 లో సూపర్ స్టార్ రజినీకాంత్ పవర్ ఫుల్ కేరెక్టర్ ముత్తువేల్ పాండియన్ కి సరిపోయే విలన్ గా వర్మ కనిపించాడు. వర్మ విలనిజం జైలర్ 1 లో మేజర్ హైలెట్.
ఇప్పుడు పార్ట్ 2 లో అదే మైనస్ అయ్యింది. ఎస్ జె సూర్య మంచి విలనే. కానీ సూర్య ని అలాంటి కేరెక్టర్స్ లో చాలా చూసేసి ఉన్నారు ఆడియన్స్. జైలర్ 2 ఫస్ట్ హాఫ్ లో స్టార్ విలన్ లేడు, కానీ డార్క్ కామెడీతో నెల్సన్ దిలీప్ ఆడియన్స్ ను నవ్వించడంలో 100 కాదు 200 పెర్సెంట్ సక్సెస్ అయ్యారు.
కానీ ఆ సెకండ్ హాఫ్ లో సూర్య ఎంట్రీ దగ్గర నుంచి కథలో ఫ్లో లేకుండా పోయింది. సూర్య తన విలనిజంలో భయపెట్టినా ఆడియన్స్ భయపడడం లేదు. సూర్య ని చూసి ఓకే ఓకే గా ఫీలవుతున్నారు తప్ప కొత్తగా ఫీలయ్యింది లేదు. లేడీ విలన్ గా విద్య బాలన్ కేరెక్టర్ నచ్చినట్టుగా.. సూర్య ప్రేక్షకులకు ఆనలేదు.
పార్ట్ 1లో వర్మ కేరెక్టర్ ముందు పార్ట్ 2 లో సూర్య కేరెక్టర్ తేలిపోయింది అంటున్నారు. జైలర్ 2 కోసం ఎవరైనా కొత్త విలన్ ని నెల్సన్ తీసుకోవాల్సింది, అలాగే సెకండ్ హాఫ్ లో కామెడీ పై ఇంకాస్త శ్రద్ద పెడితే కోలీవుడ్ ఇండస్ట్రీ రూ.1000 కోట్ల కల జైలర్ 2 తీర్చేసేది అంటూ చాలామంది మాట్లాడుకుంటున్నారు.
















































