ఆ హీరో అంటే పిచ్చి అంటున్న మృణాల్
Mrunal Thakur about Shah Rukh Khan
ఈమధ్యన హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో డేటింగ్ చేస్తుంది అనే వార్తలను ఇరువురు కొట్టిపారేశారు. మృణాల్ ఠాకూర్, ధనుష్ జస్ట్ ఫ్రెండ్స్ అని క్లారిటీ ఇచ్చారు. ఆతర్వాత వీరు కలిసిన సందర్భం లేదు, దానితో వాళ్లపై పుకార్లు కనిపించడం కూడా మానేశాయి.
తాజాగా మృణాల్ ఠాకూర్ తనకొక హీరో అంటే పిచ్చి అంటూ చేసిన కామెంట్లు ఇప్పుడు సంచలనంగా మారాయి. బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ నా లైఫ్ లో లేడనే విషయం నా హార్ట్ ని బ్రేక్ చేసింది. స్క్రీన్ పై రొమాన్స్ విషయంలో ఆయన క్రియేట్ చేసిన బెంచ్ మార్క్ గురించి ఎంత మాట్లాడినా తక్కువే. నాకు షారుక్ సర్ అంటే పిచ్చి ప్రేమ.
సిల్వర్ స్క్రీన్ పై ఆయన చేసిన పాత్రలంటే చాలా ఇష్టం. అసలు షారుక్ లా రొమాంటిక్ గా ఉండే వ్యక్తిని నేను ఇప్పటిదాకా కలవలేదు.. అంటూ మృణాల్ ఠాకూర్ షారుఖ్ పై తనలో ఉన్న ప్రేమను బయటపెట్టింది. ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ సౌత్ లో సినిమాలు తగ్గించి హిందీలో బిజీ అయ్యే ప్రయత్నాల్లో ఉంది.
















































