ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bigg Boss Telugu 10: Nagarjuna fires on Shalini

బిగ్ బాస్10: షాలిని పై నాగ్ ఆగ్రహం

Bigg Boss Telugu 10: Nagarjuna fires on ShaliniBigg Boss Telugu 10: Nagarjuna fires on Shalini


బిగ్ బాస్ శనివారం ప్రోమో కోసం చాలామంది ఎదురు చూసారు. కారణం ఏ కంటెస్టెంట్స్ ని హోస్ట్ నాగార్జున తిడతారో చూడాలని. కాస్త లేట్ గా వచ్చిన బిగ్ బాస్ సీజన్ 10 ఈ శనివారం ప్రోమోలో నాగార్జున కామనర్స్ షాలిని, అమన్, రోహిత్ లపై ఫైర్ అయ్యారు. నామినేషన్స్ విషయం డిస్కర్స్ చెయ్యొద్దు అని చెప్పినా అమన్, రోహిత్, షాలిని డిస్కర్స్ చేయడంపై నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేసారు. దానితో పనిష్మెంట్ అంటూ.. వారి ముగ్గురికి ఈ వారం కెప్టెన్సీ కంటెండర్లు అయ్యే ఛాన్స్ తీసేసారు.

షాలిని నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మారవా అంటూ క్లాస్ పీకారు. ఇక టాస్క్ లో గొడవపడుతూ షాలిని త్రిగున్ ని అన్న బూతు పై నాగార్జున అడగగా అది తప్పులేదు అన్నట్టుగా షాలిని మాట్లాడుతుంది. అసలు నువ్వేమన్నావో తెలుసా అని నాగ్ అనగానే రోహిత్ ఏదో మాట్లాడబోయాడు. నువ్వు అగు రోహిత్ ఇదేమన్నా నామినేషన్స్ అనుకున్నావా మధ్యలోకి దూరడానికి అంటూ రోహిత్ కి క్లాస్ 
పీకారు.

ఆతర్వాత షాలిని నీతూ మాస్టర్ తో గొడవ పడిన క్లిప్ ప్లే చేసి నువ్ ఆమెను మెంటల్ అని అర్ధం వచ్చేలా వేలితో ఇలా అన్నావ్, ఆమె కాదు నిన్నే అలా అనుకుంటారు. నువ్వు ఆడియన్స్ ముందు ఎంతగా దిగజారిపోతున్నావో తెలుసా అన్నారు, రోహిత్ షాలిని చేసింది కరెక్ట్ నా అనగానే లేదు సర్ శాలినిదే తప్పు అన్నాడు. ప్రస్తుతం నాగ్ కామనర్స్ పై ఫైర్ అయిన ప్రోమో వైరల్ అవుతోంది. 

Bigg Boss 10: Nagarjuna expresses anger towards Shalini