ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Ranabaali Real Story: When nearly 1 crore died in the Great Madras

చరిత్ర చూపించని నిజాన్ని ఆవిష్కరించారు!

Ranabaali Real Story: When nearly 1 crore died in the Great MadrasRanabaali Real Story: When nearly 1 crore died in the Great Madras

విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న జంటగా నటించిన పీరియాడిక్ డ్రామా `రణబాలి` రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ నేపథ్యంలో  దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సోషల్ మీడియా వేదికగా సినిమాపై, చిత్రబృందంపై ప్రశంసల వర్షం కురిపించారు. విమర్శకులు, ప్రేక్షకుల ఆదరణ పొందుతున్న ఈ చిత్రంపై వంగా చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో  చర్చనీయాంశమయ్యాయి.

విజయ్ దేవరకొండ నటన, రష్మిక పాత్ర పోషణ అద్భుతంగా ఉన్నాయని సందీప్ రెడ్డి వంగా కొనియాడారు. `అందరూ తప్పకుండా థియేటర్లకు వెళ్లి ``రణబాలి` సినిమాను చూడండి. దేవరకొండ విజయ్ సాయి పాత్రను ఆవిష్కరించిన తీరు అత్యుత్తమంగా ఉంది. ఇక విజయ్, రష్మికల జంట కేవలం ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీకి మాత్రమే పరిమితం కాలేదు. అంతకుమించిన బంధం వారి నటనలో కనిపించింది` అని  పేర్కొన్నారు.

అలాగే సినిమాలో రష్మిక మందన్న పోషించిన 'జయమ్మ' పాత్ర ఎంతో సహజంగా.. హృదయానికి హత్తుకునేలా ఉందంటూ వంగా ప్రత్యేకంగా అభినందించారు. చిత్రానికి అజయ్-అతుల్ అందించిన సంగీతం అద్భుతమైన అనుభూతిని ఇచ్చిందని, దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ మన చరిత్రలోని  ముఖ్యమైన ఘట్టాన్ని అత్యంత శ్రద్ధతో, జిజ్ఞాసతో తెరపైకి తీసుకువచ్చారని కొనియాడారు.

భారతీయ పాఠ్యపుస్తకాలు సైతం చూపించడానికి వెనుకాడిన మన హిస్టరీలోని ఒక అరుదైన కోణాన్ని ఈ సినిమాలో చూపించారని సందీప్ వంగా అభిప్రాయపడ్డారు. `ఈ సినిమా కేవలం వినోదానికి మాత్రమే పరిమితం కాలేదు.  తీవ్రమైన అకడమిక్  ప్రాధాన్యత కలిగిన అంశాన్ని మన ముందుకు తెచ్చింది` అని వ్యాఖ్యానించడం విశేషం. 

Ranabaali Movie