రీ షూట్ లో ఆదర్శ కుటుంబం ?
Aadarsha Kutumbam Headed For Reshoots?
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ నటించిన ఆదర్శ కుటుంబం చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. వారానికొక డేట్ మారుస్తూ నాగవంశీ మిగతా నిర్మాతలను ఇబ్బంది పెట్టి ఇప్పుడు ఆ చిత్రానికి కొత్త డేట్ ఇవ్వకుండా కంఫ్యూజన్ లో పడేసారు. ప్రస్తుతం ఆదర్శ కుటుంబాన్ని పక్కనపెట్టి జైలర్ 2 సక్సెస్ ని ఆయన ఎంజాయ్ చేస్తున్నారు.
అది చూసి అసలు ఆదర్శ కుటుంబం విషయంలో ఏం జరుగుతుంది, ఎస్.ఎస్ తమన్ RR కంప్లీట్ అవ్వలేదు, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది, సోషల్ మీడియాకి భయపడి సినిమాని పోస్ట్ పోన్ చేసాము అన్నారు. కానీ ఇప్పుడు చాలామందిలో AK 47 అవుట్ ఫుట్ చూసి సంతృప్తి చెందని దర్శకుడు త్రివిక్రమ్ ఆదర్శ కుటుంబానికి ఏమైనా రీ-షూట్స్ చేస్తున్నారా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
చాలామందిలో ఇదే డౌట్ కనిపిస్తుంది. తమన్ ఇచ్చే RR కోసం ఇంతగా వెయిట్ చేయిస్తాడా, ఆదర్శ కుటుంబం పోస్ట్ పోన్ వెనుక ఏదో జరుగుతుంది అంటూ మాట్లాడుకుంటున్నారు. మరోపక్క ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను బట్టి రిలీజ్ డేట్ ఉంటుంది అనే ట్వీట్లు కూడా సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి.
















































