ఫైనల్ గా పెళ్ళిపీటలెక్కుతున్న సెలెబ్రిటీ జంట
Celebrity couple finally set to tie the knot
టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్ర, సన్ రైజర్స్ ఓనర్ కావ్య మారన్ ల వివాహానికి ముహూర్తం కుదిరింది. కొన్నాళ్లుగా అనిరుద్ రవిచంద్ర, కావ్య పాప ప్రేమలో ఉన్నారు, సీక్రెట్ డేటింగ్ అంటూ కథనాలు కనిపిస్తున్నా.. వీరిద్దరూ ఎప్పుడు, ఎక్కడా బయట పడలేదు, అనిరుద్ పై బోలెడన్ని ఎఫ్ఫైర్ న్యూస్ లు ప్రచారం లో ఉండేవి.
ప్రస్తుతం జైలర్ 2 తో అనిరుద్ రవిచంద్ర పేరు మార్మోగిపోతోంది. అనిరుద్ నేపధ్య అంగీతాన్ని పొగిడినవారే కానీ, పొగడని వారు లేదు. జైలర్ 2 విషయంలో కీలక పాత్ర అనిరుద్ BGM దే. అలాంటి సమయంలో అనిరుద్ రవిచంద్ర పెళ్ళికి ముహూర్తం అనే వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.
ప్రముఖ నిర్మాత కళానిధి మారన్ కుమార్తె, సన్ రైజర్స్ ఓనర్ కావ్య మారన్ తో అనిరుద్ రవిచంద్ర నవంబరు 10న డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారు. వీరి వివాహం గ్రీస్ వేదికగా జరగబోతుంది. ఈ వివాహానికి రెండు కుటుంబాలకు చెందిన ముఖ్యమైన సభ్యులు, సన్నిహితుల నడుమ అనిరుధ్, కావ్యల పెళ్లి గ్రాండ్ గా జరగనున్నట్లు తెలుస్తోంది.
ఆతర్వాత నవంబరు 21న చెన్నైలో అనిరుధ్, కావ్యల వెడ్డింగ్ రిసెప్షన్ కోసం ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ రిసెప్షన్ కోసం కళానిధి మారన్, ఆయన భార్య కావేరి మారన్ అతిథులను ఆహ్వానించడం మొదలుపెట్టారు
















































